సీఎం కేసీఆర్ కోసం ప్రత్యేక పూజలు

అదిలాబాద్: సీఎం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని నేడు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో సాయిబాబా టెంపుల్ తో పాటు దుర్గాదేవి టెంపుల్ లో టిఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే జోగు రామన్న గారు ప్రత్యేక పూజలు నిర్వహించి ముఖ్యమంత్రి కెసిఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు… అలాగే మియావాకి ప్లాంటేషన్ లో సీఎం కేసీఆర్ నామకరణం తో మొక్కలను నాటి టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు కేక్ కట్ చేసి కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు .. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆంధ్ర పాలనలో తెలంగాణకు జరిగిన అన్యాయంపై తిరుగుబాటు చేసి నేడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని తెలంగాణ వనరులు కాపాడుకుంటు తెలంగాణ ప్రజలకు అనేక సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేసిన వ్యక్తి సీఎం కేసీఆర్ మాత్రమేనని పేర్కొన్నారు.

సర్వ మతాలను సర్వ కులాలకు సర్వ మతాలను ఏకతాటిపై తీసుకొస్తూ భిన్నత్వంలో ఏకత్వం పాలన కొనసాగిస్తున్నరన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలు ప్రతి గడప గడపకు చేరుతున్నా అన్నారు.. పొరుగు రాష్ట్రాలలో సైతం సీఎం కెసిఆర్ జన్మదిన వేడుకలు అట్టహాసంగా చేసుకోవడం చూస్తున్నామన్నారు. సీఎం కెసిఆర్ మూడురోజుల పుట్టినరోజు వేడుకల్లో కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపుతోంది అన్నారు.

Leave A Reply

Your email address will not be published.