కేసీఆర్ క్లౌడ్ బరస్ట్ ఆరోపణలపై స్పందించిన కిషన్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చేసిన క్లౌడ్ బరస్ట్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. క్లౌడ్ బరస్ట్ కుట్రలు నిజమైతే అందుకు తగిన ఆధారాలు ఇవ్వాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ విషయాన్ని సీరియస్ గా దర్యాప్తు చేయిస్తామని వెల్లడించారు.

ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కేసీఆర్ చేసిన ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఇటీవల గోదావరి వరదలు, లడఖ్, ఉత్తరాఖండ్ వరదలకు కారణమైన క్లౌడ్ బరస్ట్ లపై విదేశీ కుట్రల విషయంలో సంచలన ఆరోపణలు చేసిన సీఎం కేసీఆర్ అందుకు సాక్ష్యాలిస్తే సీరియస్ గా విచారణ చేస్తామని కిషన్ రెడ్డి వరుస ట్వీట్లు చేశారు.

Leave A Reply

Your email address will not be published.