హైదరాబాదీల చలనాలు 100 కోట్లు

హైదరాబాద్, ఫిబ్రవరి 9: తిన్నా తినకపోయినా, జేబులా నయా పైసా ఉన్నా, లేకపోయినా రోడ్డెక్కితో బండిలో పెట్రోల్ తో పాటే.. చలానాకు కూడా రెండొందల నుంచి ఐదొందల దాకా ఉంచుకోవాల్సిందే. లేకపోతే దారిలో ఏ ట్రాఫిక్ ఆపినా బండి కీ తీసుకొని నెల రోజుల దాకా తిప్పుకుంటారు. ఈ బాధలన్నీ ఎందుకురా బాబూ అనుకుంటే గనక పెట్రోల్ చార్జీలతో పాటు చలాన్ల చార్జీలు కూడా జేబులో ఉంచుకోవాల్సిందే. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఒక్క ఏడాదిలోనే 32 కోట్లా 51 లక్షల పైచిలుకు రూపాయలను సామాన్యపౌరులు చలాన్ల రూపంలో కట్టారు. 2021 సంవత్సరం జనవరి ఫస్టు నుంచి 2022 జనవరి ఫస్టు వరకు రాచకొండ కమిషనరేట్ పరిధిలో చలాన్ల రూపంలో వసూలైన సొమ్ము ఎంత అంటూ మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆర్టీఐ ద్వారా అప్రోచ్ అయ్యారు.

దీనికి రెస్పాండ్ అయిన డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆ వివరాలను కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రతినిధికి అందజేశారు. హైదరాబాద్ ఖాకీ బాసులు చలాన్ల వసూళ్లయల అడ్డూ అదుపూ లేకుండా వ్యవహరిస్తున్నారని, చలాన్లు వసూలు చేయడం తప్ప మరో పనంటూ లేదన్నట్టు వ్యవహరిస్తున్నారని విశ్వేశ్వర్ రెడ్డి అనుమానించారు. మాస్క్ పెట్టుకోకపోయినా చలాన్లు కట్ చేస్తున్నారే తప్ప అవగాహన కల్పించడం లేదంటూ వచ్చిన కంప్లయింట్స్ మీద స్పందించారు. దీని సంగతేంటో చూద్దామని ఆర్టీఐని ఆశ్రయించడంతో అసలు భాగోతం బయటపడింది. ఇక చలాన్లు కూడా సామాన్య పౌరుల మీదనే వేస్తున్నారు తప్ప రాజకీయంగా పలుకుబడి ఉన్నవారి మీద ఏనాడూ వేసిన దాఖలాలు లేవని విశ్వేశ్వర్ రెడ్డి విమర్శిస్తున్నారు.

అప్పుల్లో కూరుకుపోయిన తెలంగాణ సర్కారు.. వాటి నుంచి బయట పడటానికి తన దగ్గరున్న అన్ని మార్గాలనూ వాడుకుంటోందని, పోలీసులను సైతం అందుకే ఉపయోగించుకుంటోంది తప్ప, అసలు పోలీసుల విధుల మీద దృష్టి సారించడం లేదని ఆయన విమర్శిస్తున్నారు. ఇక ఒక్క రాచకొండ కమిషనరేట్ లోనే ఏడాదికి 32 న్నర కోట్లు వసూలైతే… మిగిలిన రెండు కమిషనరేట్లు కూడా దానికి కలుపుకుంటే ఏటా దాదాపు వంద కోట్ల చలాన్లు వసూలు చేస్తున్నట్టు అర్థమవుతోందని విశ్వేశ్వర్ రెడ్డి అభిప్రాయపడుతున్నారు. మరి.. తెలంగాణ సర్కారు వసూళ్ల మీద శ్రద్ధ చూపించినట్టే ప్రజలకు అవగాహన మీద కూడా చూపిస్తే బాగుంటుందంటున్నారు సామన్య ప్రజలు.

Leave A Reply

Your email address will not be published.