గోదావరి, కృష్ణా సహా.. నదుల అనుసంధానానికి ప్రోత్సాహం

కొరోనా కారణంగా మానసిక అనారోగ్యానికి గురైన వారి కోసం నాణ్యమైన మెంటల్‌ ‌హెల్త్ ‌కౌన్సిలింగ్‌, ‌సంరక్షణ సేవల కోసం టెలీ మెంటల్‌ ‌హెల్త్ ‌పోగ్రామ్‌ ఏర్పాటు చేస్తున్నట్లు బడ్జెట్‌ ‌ప్రసంంలో నిర్మలా సీతారామన్‌ ‌తెలిపారు. జిల్‌, ‌పెట్రోల్‌ ‌వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్‌ ‌వాహనాలను ప్రోత్సహిస్తామని, విద్యా సంస్థలు, పరిశోధనా సంస్థలు, ప్రభుత్వ సంస్థల అనుసంధానం, ప్రైవేట్‌ ‌రంగంలో అడవుల పెంపకం కోసం పథకం తీసుకుని వచ్చారు. ఉత్తర సరిహద్దుల్లో గ్రామాల అభివృద్ధి కోసం ప్రత్యేక పథకం. బొగ్గు ద్వారా గ్యాస్‌ ఉత్పత్తి కోసం 4 పైలట్‌ ‌ప్రాజెక్టులు ప్రారంభించనున్నట్లు ఆమె వెల్లడించారు.

దేశ వ్యాప్తంగా మూలధన పెట్టుబడుల కోసం రూ.10.68 లక్షల కోట్లు. మూలధన పెట్టుబడుల కోసం రాష్టాల్రకు కేంద్ర సాయం. పట్టణ ప్రణాళిక కోసం ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు. ఎల్‌ఐసీని పబ్లిక్‌ ఇష్యూ ద్వారా ప్రైవేటీకరణ చేస్తామన్నారు. డ్రోన్ల సాయంతో పంట పొలాల పరీక్షలు. వ్యవసాయ యూనివర్శిటీల సిలబస్‌ ‌లో మార్పులు చేస్తామన్నారు. మన్‌ ‌గంగా  పీర్‌ ‌పంజాల్‌, ‌పర్‌ ‌తాపీ నర్మదా, గోదావరి కృష్ణా, కృష్ణా పెన్నా, పెన్నా-కావేరీ నదుల అనుసంధానానికి బడ్జెట్‌లో ప్రోత్సాహం దక్కింది, దీని వల్ల లబ్ది పొదే రాష్ట్రాల నుంచి అంగీకారం రాగానే నదుల అనుసంధానం ప్రయత్నాలను కేంద్రం ప్రారంభిస్తుందని, కాలం చెల్లిన చట్టాలను రద్దు చేస్తామని ఆమె పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.