62వ రోజు కు చేరుకున్న లయన్స్ క్లబ్స్ ఆఫ్ మిర్యాలగూడ ఆధ్వర్యంలో మీల్స్ ఆన్ వీల్స్ కార్యక్రమంలో భాగంగా నిత్య ఉచిత అల్పాహార మరియు అరటిపండ్ల పంపిణీ వితరణ నేటికి 62వ రోజుకు చేరుకుంది
తేదీ 9. 1. 2023 సోమవారము ఉదయము 8.గంటలకు ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలోనున్న పేషంట్ల సహాయకులకు నిత్య ఉచిత అల్పాహారము కార్యక్రమంలో భాగంగా లయన్ రీజనల్ చైర్మన్ మాశెట్టి శ్రీనివాసు (డైమన్డ్ శ్రీను) ఆధ్వర్యంలో బండారు కుశలయ్య దంపతులు మరియు కీర్తిశేషులు కోల లచ్చయ్య గారి 27వ వర్ధంతి సందర్భంగా వారి శ్రీమతి కోల భూలక్ష్మమ్మ ల సహకారంతో ముఖ్య అతిథులుగా విచ్చేసిన టీపీసీసీ కార్యదర్శి అలుగుబెల్లి అమరేందర్ రెడ్డి సుమారు 300 మందికి అల్పాహార పంపిణీ చేశారు, కార్యక్రమానికి విచ్చేసిన అలుగుబెల్లి అమరేందర్ రెడ్డి ఇంత మంచి సేవా కార్యక్రమం చేస్తున్న సందర్భంలో ఈ నిరుపేదల మధ్యలోనే తన పుట్టినరోజు సందర్భంగా కేకు కట్ చేసి సుమారు 600 అరటి పండ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగుల సహాయకులకు ప్రతిరోజు నిత్య అన్నదాన పథకాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్న లయన్స్ క్లబ్ మిత్రులకు అభినందనలు తెలుపుతూ ప్రతి ఒక్క వ్యాపారవేత్త రాజకీయ నాయకుడు ఇక్కడ జరిగే సేవా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం తీసుకోవాలని నా జన్మదినం సందర్భంగా ఇక్కడికి రావడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న లయన్స్ క్లబ్ నాయకులకు ఎల్లవేళలా నా సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు
కార్యక్రమంలో రీజనల్ చైర్మన్ లయన్ మాసెట్టి శ్రీనివాస్ . లయన్ ముక్కపాటి వెంకటేశ్వరరావు . లయన్ డాక్టర్ రాజు . లయన్ శ్రీమతి ఏచూరి భాగ్యలక్ష్మి భాస్కర చార్టర్ ప్రెసిడెంట్ ఏచూరి మురహరి లయన్ కోల సైదులు ముదిరాజు లయన్ బి.ఎం .నాయుడు మరియు వాలంటరీలు.రఫీ, బాబు, నాగేంద్ర. కాంగ్రెస్ పార్టీ నాయకులు కంచర్ల దయాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.