తిరునగరు గంగాధర్ కు ఘన నివాళి
స్వాతంత్య్ర సమరయోధులు, మాజీ సైనికులు, స్వర్గీయ తిరునగరు గంగాధర్ 3వ వర్ధంతిని నల్గొండజిల్లామిర్యాలగూడలో నిర్వహించారు.వర్ధంతిని పురస్కరించుకొని శుక్రవారం మిర్యాలగూడ పట్టణంలోని రాజీవ్ చౌక్వద్ద గల గంగాధర్ విగ్రహానికి తనయులు,మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి,తెలంగాణ రాష్ట్ర అగ్రోస్ చైర్మన్ తిప్పన విజయసింహరెడ్డి తో కలిసి శాసనసభ్యులు నల్లమోతు భాస్కరరావు పూలమాలలు వేసి నివాళ్ళు అర్పించారు.ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటి చైర్మన్ ధనవత్ చిట్టిబాబు నాయక్,మాజీ మున్సిపల్ చైర్మన్ మెరుగు రోశయ్య,మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మక్దూం పాషా,కౌన్సిలర్ వంగాల నిరంజన్ రెడ్డి,నాయకులు మన్నెం లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.