వాట్సాప్ మెసేజ్ కు స్పందించిన బత్తుల లక్ష్మారెడ్డి..(BLR)

వాట్సాప్ మెసేజ్ కు స్పందించిన బత్తుల లక్ష్మారెడ్డి..(BLR)…

మిర్యాలగూడ పట్టణంలోని రవీందర్ నగర్లోని వీధి దీపాలు వెలగట్లేదనే అంశంపై వాట్సాప్ లో వచ్చిన మెసేజ్కు తక్షణమే స్పందించిన బత్తుల లక్ష్మారెడ్డి. రవీందర్నగర్ లోని వార్డు మొత్తం కలియ తిరుగుతూ ప్రజలతో మమేకమై ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వార్డులో ఉన్న ప్రధాన సమస్య అయిన వీధిదీపాల ఏర్పాటుపై తక్షణమే స్పందించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు స్పాట్ లోనే ఉంటూ వీధి దీపాలని వెలిగించి వచ్చారు. ప్రజల సమస్యలు ఏకరుపెట్టిన పట్టించుకోనీ నాయకులు ఉన్న ఈ రోజుల్లో బిఎల్ఆర్ ప్రజల నుంచి సమస్యను తెలుసుకొని స్పందించడం హర్షనీయం అన్నారు వార్డు ప్రజలు అనేక సందర్భాల్లో ప్రజాప్రతినిధిగా కొన్ని కొన్ని పనుల మీద నియోజకవర్గము మొత్తం పర్యటించాల్సి వస్తుంది .ఆ సందర్భంలో ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు వాట్సాప్ ద్వారా సమస్యను విన్నవించినట్లయితే పరిష్కరిస్తానని ఈ సందర్భంగా బిఎల్ఆర్ ప్రకటించారు. అన్న మాటకు కట్టుబడి వాట్సాప్ లో వచ్చిన మెసేజ్ కు స్పందించి రవీంద్ర నగర్ శివారు ప్రాంతాల్లో వీధి దీపాలను ఏర్పాటు చేయించి ప్రజల చే శభాష్ అనిపించుకున్నారు. నాయకుడు అనే వాడు విమర్శలను కూడా హుందాగా స్వీకరిస్తూ వాటికి పరిష్కారం చేయించినప్పుడే నాయకత్వ లక్షణాలు బయటపడతాయి అనడానికి బత్తుల లక్ష్మారెడ్డి (బిఎల్ఆర్) నిదర్శనం అన్నారు. ఇది పొగడ్తలు అయితే కాదు.బత్తుల లక్ష్మారెడ్డి ప్రవేశపెట్టిన పలు పథకాలను స్థానికంగా ఉన్న ఇతర రాజకీయ పార్టీ నాయకులు మాస్ కాపీలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ప్రజల కోసం పనిచేసే నాయకులను మనము కనుగుడ్డును కనురెప్ప కాపాడినట్టుగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.ఒకవైపు అధికార పార్టీ కౌన్సిలర్లు గెలిచిన ప్రాంతం అభివృద్ధికి అడుగడుగున అడ్డుపడుతున్న వారిని లెక్కచేయకుండా ముందుకు తీసుకుపోతున్న బిఎల్ఆర్ని గౌరవించాల్సిన అవసరం ఉన్నది అని పార్టీతో ప్రమేయం లేకుండా అన్ని వర్గాల ప్రజలు అనుకుంటున్నారు మిర్యాలగూడ మున్సిపాలిటీలో అధికార పార్టీ కౌన్సిలర్లలు ఉన్నచోట అభివృద్ధి ప్రతిపక్ష కౌన్సిలర్లు ఉన్నచోట అభివృద్ధి జాడలు ఉండటం లేదు .ఇది బహిరంగ రహస్యం ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కాంగ్రెస్ కౌన్సిలర్లకు బిఎల్ఆర్ అండగా ఉంటూ వారికి వారి ప్రాంతాల్లో అభివృద్ధి కావాల్సిన మార్గాలను సూచిస్తూ ముందుకు తీసుకుపోతున్నారు .

Leave A Reply

Your email address will not be published.