హిందూ మహాసభ ప్రతినిధులు క్షమాపణ చెప్పే వరకు పోరాడాలి
దేశానికి ఆహీంసా మార్గంలో స్వాతంత్ర్యం తీసుకువచ్చిన పూజ్య బాపూజిని మహిషాసురుడుగా చిత్రీకరిస్తూ అవమాన పర్చిన హిందూ మహాసభ ప్రతినిధులు వెంటనే క్షమాపణ చెప్పాలని ప్రముఖ ఆర్యవైశ్య నాయకులు కాచారం రేణుక ఎల్లమ్మ దేవస్థానం వ్యవస్థాపక చైర్మన్ వంగపల్లి అంజయ్య స్వామి డిమాండ్ చేశారు.
మహాత్ముడిని అవమానించడాన్ని నిరసిస్తూ యావత్ భారతజాతిని ఏకతాటిపైకి తీసుకువచ్చి కుల, మత, జాతి తేడాలు లేకుండా స్వతంత్ర పోరాటం సాగించిన మహాత్మాగాంధీని అవమానించేలా ప్రవర్తించిన సంబంధిత సంస్థ వెంటనే మహాత్ముడికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మహాత్మా గాంధీని అవమానించిన వ్యక్తులు, హిందూ మహాసభ ప్రతినిధులను వెంటనే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇది అత్యంత హేయమైన చర్య అని, ప్రపంచం మొత్తం పూజించే గాంధీని అవమానించడం సిగ్గుచేటని అలాంటి వారిపై కఠినంగా వ్యవహారించి భారత జాతి తలెత్తుకునేలా చేయాలన్నారు.
మహాత్ముడిని అవమానించిన వ్యక్తులు ఉగ్రవాదులతో సమానమని అలాంటి వారిపై దేశద్రోహం కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. ఇలాంటి సంస్థలు, ప్రతినిధులను శిక్షించే వరకు పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు.