దేశ రాజకీయాల్లో పెను మార్పుకి ఖమ్మం వేదిక కానుంది. తుమ్మల

*18వ తేదీన దేశ రాజకీయాల్లో పెను మార్పుకి ఖమ్మం వేదిక కానుంది..*

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్ బహిరంగ సభ ఏర్పాట్లపై ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీ నామా, మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రభుత్వ చీఫ్ విప్ రేగా కాంతారావు పాల్గొన్నారు. సమావేశం అనంతరం తుమ్మల మీడియాతో మాట్లాడుతూ.. 18వ తేదీన దేశ రాజకీయాల్లో పెను మార్పుకి ఖమ్మం వేదిక కానుందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో అభివృద్ధి లేని విధంగా మన రాష్ట్రంలో ఉందన్నారు. దేశంలో ప్రాంతీయ పార్టీగా ఉన్న తెలుగుదేశం జాతీయ పార్టీగా ఏర్పడిందన్నారు. దేశ రాజకీయాలను మలుపు తిప్పే విధంగా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అడుగు వేస్తున్నారని అన్నారు. సీతారామ ప్రాజెక్ట్ పూర్తయితే 10 లక్షల ఎకరాలకు సాగు నీరు అందిస్తామన్నారు. అశ్వారావుపేట అంటే ఆయిల్ పామ్ పంట సాగుకు కేరాఫ్ అడ్రస్ అన్నారు. తాత్కాలిక ప్రయోజనాలు కోసం వేరే వ్యక్తులతో మీరు వెళ్తే అది మీ కర్మ అని తుమ్మల సంచలన వ్యాఖ్యలు చేశారు..

Leave A Reply

Your email address will not be published.