డ్రైవర్ నిద్ర మత్తు. అదుపుతప్పి ముళ్ళ పొదల్లో కి దూసుకెళ్లిన బస్సు

*డ్రైవర్ నిద్ర మత్తు.. అదుపుతప్పి ముళ్ళ పొదల్లోకి దూసుకెళ్లిన బస్సు*
జోగులాంబ గద్వాల జిల్లా వార్తలు
ఇటిక్యాల: పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణికులంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.సంక్రాంతి పండుగకు హైదరాబాద్ నుంచి బెంగళూరు వైపు ప్రైవేటు బస్సులో వెళ్తుండగా.. బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డు నుండి ముళ్లపొదల్లోకి దూసుకెళ్లింది. డ్రైవర్ నిద్ర మత్తులో ఉండడంతో రోడ్డుపై వెళ్లే బండి అదుపుతప్పి ముళ్లపొదల్లోకి దూసుకు వెళ్లడంతో ఒక్కసారిగా ప్రయాణికులు హడలెత్తారు. బస్సులో ఉన్న వారందరూ కేకలు వేస్తూ ఏం జరుగుతుందోనని తెలియని పరిస్థితి నెలకొంది. ముగ్గురికి స్వల్ప గాయాలు కావడంతో ప్రయాణికులందరూ ఊపిరి పీల్చుకున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండల పరిధిలోని 44వ జాతీయ రహదారిపై కొట్టంకళాశాల సమీపంలో శనివారం తెల్లవారుజామున హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. ముగ్గురికి స్వల్ప గాయాలు కావడంతో హుటాహుటిన హైవే అంబులెన్స్లో క్షతగాత్రులను తరలించారు. మిగతా వారందరినీ వేరే బస్సులో సురక్షితంగా బెంగళూరుకు తరలించినట్లుసమాచారం.

Leave A Reply

Your email address will not be published.