డాక్టర్ వంగపల్లి అంజయ్య స్వామికి ఘన సన్మానం

వంగపల్లి అంజయ్య స్వామికి ఘన సన్మానం

యాదాద్రిభువనగిరి జిల్లా కాచారాం గ్రామంలో తూర్పుగూడెం స్వాములు వారు మరియు ధర్మపత్ని వెంకటమ్మ కుటుంబ సభ్యులందరూ మంగళవారం రేణుక ఎల్లమ్మ దేవాలయ వ్యవస్థాపకులు భక్తి రత్న అవార్డు గ్రహిత డాక్టర్ వంగపల్లి అంజయ్య స్వామికి ఇటీవల డాక్టరేట్ పొందడం వల్ల వారిని శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.ఈసందర్భంగా వారు మాట్లాడుతూ యదాద్రి భువనగిరి జిల్లా కాచారం గ్రామం రేణుకా ఎల్లమ్మ దేవాలయం వ్యవస్థాపక అధ్యక్షుడు వంగపల్లి అంజయ్య స్వామి అధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలను భక్తి మార్గం వైపు మల్లే విధంగా విశేష కృషి చేస్తూ ప్రతి మంగళ వారం రేణుకా ఎల్లమ్మ దేవాలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదానం చేస్తూ అధ్యాత్మిక ధార్మిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అంజయ్య స్వామి సేవలను గుర్తించి తమిళనాడు లో ఏషియా వేదిక కల్చర్ రీసెర్చ్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో డాక్టరేట్ అవార్డు పొందిన అంజయ్య స్వామికి చిరుసన్మానం చేయడం జరిగిందని అన్నారు.కార్యక్రమంలో గట్టు సత్యనారాయణ విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు,రాజరాజేశ్వరి భిసు శ్రీనివాస్ మల్లేశ్వరి, ఊట్కూరు మల్లేశా పూజారి,సురేష్ శ్రీవాణి చంద్రం,మొరంశెట్టి శ్రీనివాస్ నాగరాణి తథితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.