చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం.. నిధులివ్వండి: కేటీఆర్

హైదరాబాద్‌: పట్టణాల అభివృద్ధికి నిధులు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్రానికి ఆయన లేఖ రాశారు. ‘‘పట్టణాల అభివృద్ధికి భారాస ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది. నిధుల కోసం ప్రతిపాదనలు పంపిన ప్రతిసారి తెలంగాణకు నిరాశే ఎదురవుతోంది. వివక్షతోనే ఇప్పటివరకు అదనంగా ఒక్క రూపాయి కూడా రాష్ట్రానికి ఇవ్వలేదు. ఈసారి పట్టణాల అభివృద్ధికి బడ్జెట్‌లో నిధులు కేటాయించాలి. హైదరాబాద్‌, వరంగల్‌ లాంటి పట్టణాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలి’’ అని లేఖలో కేటీఆర్‌ పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.