ఖమ్మం జిల్లాలో ప్రతి అంగుళానికి నీళ్లిస్తాం.. కేసీఆర్

*ఖమ్మం జిల్లాలో ప్రతి అంగుళానికి నీళ్లిస్తాం.. కేసీఆర్*

*భద్రాద్రి కొత్తగూడెం:* ఖమ్మం జిల్లాలో ప్రతి అంగుళానికీ నీళ్లిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.భద్రాద్రి కొత్తగూడెంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ….కొత్తగూడెం జిల్లా చాలా వచ్చాయి ఇంకా వస్తాయని అన్నారు. పాల్వంచ,కొత్తగూడెం మున్సిపాలిటీలకు రూ.40కోట్ల చొప్పున నిధులు విడుదల చేస్తామన్నారు.మిగిలిన మున్సిపాలిటీలకు రూ.25కోట్ల చొప్పున నిధులిస్తామన్నారు. మైనింగ్ ఇనిస్టిట్యూట్ ను పూర్తి స్థాయి ఇంజనీరింగ్ కాలేజీగా మారుస్తామన్నారు.పొరుగు రాష్ట్రాల కంటే తెలంగాణ జీడీపీ పెరిగిందన్నారు.దేశాన్ని వక్రమార్గం పట్టించే దుష్ట పన్నాగాలు జరుగుతున్నాయన్నారు. తెలంగాణ ఒక్కటే కాదు దేశం మొత్తం బాగుండాలన్నారు.దేశం బాగుంటేనే మనమంతా బాగుంటామన్నారు. నీటికోసం రాష్ట్రాల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయన్నారు. ప్రపంచం మొత్తంలో సాగునీటి వనరులు ఎక్కువగా ఉన్న దేశం భారతదేశమేనన్నారు. భద్రాద్రి జిల్లా అన్ని రంగాల్లో డెవలప్ కావాలని కోరుకుంటున్నానన్నారు. కొత్తగూడెంకు కొత్త కలెక్టరేట్,మెడికల్ కాలేజీ వచ్చిందన్నారు.

Leave A Reply

Your email address will not be published.