ఏడుపాయల వన దుర్గాభవాని మాత సన్నిధిలో భక్తుల సందడి

మెదక్/పాపన్నపేట: నూతన ఆంగ్ల సంవత్సరం వేళా ఆదివారం ఏడుపాయల వన దుర్గాభవాని మాత సన్నిధిలో భక్తుల సందడి నెలకొంది. శనివారం రాత్రి 12 గంటలతో 2022 సంవత్సరం ముగిసి 2023వ సంవత్సరంలోకి అడుగిడిన సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఏడుపాయలకు పెద్దసంఖ్యలో చేరుకొని, నూతన సంవత్సరం అనుకూలించేలా చూసుకోవాలి అంటూ మొక్కులు చెల్లించుకున్నారు. పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకొని గత సంవత్సరం జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఈ కొత్త సంవత్సరం తమకు ఎలాంటి విఘ్నాలు కలగకుండా చూసుకోవాలని అమ్మవారిని కోరుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ సాతెల్లి బాలాగౌడ్, ఈవో సారా శ్రీనివాస్ తమ సిబ్బందితో తగిన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు పార్థివ శర్మ , శంకర్ శర్మ, రాజశేఖర్ శర్మ, అమ్మవారిని ప్రత్యేకమైన పూలతో అలంకరించారు.

Leave A Reply

Your email address will not be published.