హైదరాబాద్: సంఘ సంస్కర్త సావిత్రిబాయి ఫూలే ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణ ప్రభుత్వం అనేక మహిళా కార్యక్రమాలను చేపడుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా ఆమెకు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్య ద్వారానే మహిళల వికాసం జరుగుతుందని నమ్మి, తొలి ఉపాధ్యాయురాలుగా విద్యను బోధించారని గుర్తు చేశారు. మొట్టమొదటి బాలికల పాఠశాలను ప్రారంభించి, దళిత, బహుజన స్త్రీ జనోద్దరణ కోసం తన జీవితాంతం కృషి చేసిన మహనీయురాలు సావిత్రిబాయి అని కొనియాడారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ అడుగుజాడల్లో తెలంగాణ రాష్ట్రంలో మహిళల వికాసం, సాధికారత కోసం బాలికల విద్య, సంక్షేమం, భద్రత, అభివృద్ధికి అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా మహిళలకు తొలిసారిగా డిగ్రీ రెసిడెన్షియల్ కాలేజీలు పెట్టిన ఘనత కూడా తెలంగాణ ప్రభుత్వానికే దక్కిందన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.