అమ్రాబాద్ టైగర్ రిజర్వుల్లో ఎకో టూరిజం కార్యక్రమాలను ప్రారంభించిన మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి

ట్రీ, మడ్ హౌసెస్ రిసార్ట్… ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ లో పర్యాటకులకు సరికొత్త అనుభూతి

నాగర్ కర్నూల్ జిల్లా : అమ్రాబాద్ టైగర్ రిజర్వుల్లో ఎకో టూరిజం కార్యక్రమాలను మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. మన్ననూరులో ఏర్పాటుచేసిన జంగిల్ రిసార్ట్స్ తో పాటు ఆరు కాటేజీలను మంత్రి ప్రారంభించారు. అలాగే అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ లో సఫారీకోసం 8వాహనాలను కూడా మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. టైగర్ స్టేట్ ప్యాకేజ్ను ఆన్ లైన్ లో బుక్ చేసుకునేందుకు వీలుగా పోర్టల్ ప్రారంభించారు. పర్యాటకులకు సేవలు అందించేందుకు కొత్తగా శిక్షణను ఇచ్చిన గైడ్లు కూడా నేటినుండి అందుబాటులోకి వచ్చారు. ఇక అటవీ పర్యవేక్షణకు వీలుగా కొత్తగా 10నిఘా కెమెరాలు ఏర్పాటుచేయగా వాటిని కూడా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఇవాళ ప్రారంభించారు.

Leave A Reply

Your email address will not be published.