కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు, ఆసుపత్రులలో పండ్లు పంపిణీ

రంగారెడ్డి: తెలంగాణ ముద్దుబిడ్డ మన ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా హాస్పిటల్ లో పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు, ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, మేయర్ గద్వాల విజయలక్ష్మి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లా వనస్థలిపురం ఏరియా హాస్పిటల్ లో సీఎం కెసిఆర్ పుట్టినరోజు సందర్భంగా పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది, సీఎం కేసీఆర్ పుట్టిన రోజు మూడు రోజులు ఘనంగా నిర్వహిస్తున్నాము అని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తెలియజేశారు.

పండ్ల పంపిణీ అన్నదాన కార్యక్రమాలు రక్తదాన శిబిరాలు చేయబోతున్నామని అందులో భాగంగా అనాధ ఆశ్రమాల్లో అన్నదానం పండ్ల పంపిణీ కూడా చేస్తున్నాము అని ఎమ్మెల్యే తెలిపారు అందులో భాగంగా ఏరియా హాస్పిటల్లో పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించామని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు తెలిపారు. వర్షాకాలంలో లోతట్టు ప్రాంతాలు జలమయం కాకుండా చూస్తామని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తెలిపారు, ముందు జాగ్రత్తగా బండ్లగూడ నుండి మూసి వరకు చేపడుతున్న ఎస్ ఎన్ డి పి ద్వారా చెప్పాడుతున్న నాల పనులను అధికారుల తో కలసి మేయర్ గద్వాల విజయలక్ష్మి పరిశీలించడం జరిగింది అని ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తెలియజేశారు.

Leave A Reply

Your email address will not be published.