డ్రగ్స్ కేసు… సినీ స్టార్స్ కు ఈడి నోటీసులు?

హైదరాబాద్: డ్రగ్స్ కేసు మళ్లీ తెరమీదికి వచ్చింది. ఈసారి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడి) రంగంలోకి దిగింది. ఈ కేసులో సంబంధం ఉన్న నటీనటులకు సమన్లు జారీ చేసినట్లు ఫిల్మ్ నగర్ లో చర్చించుకుంటున్నారు.

ఆగస్టు 31వ తేదీ నుంచి సెప్టెంబర్ 22వ తేదీ వరకు విచారణ జరుపుతున్నట్లు తెలిపింది. సమన్లు అందుకున్నవారిలో రవితేజ, దగ్గుబాటి రానా, తరుణ్, నవదీప్, తనీష్, దర్శకుడు పూరి జగన్నాథ్, హీరోయిన్లు ఛార్మి, రకుల్ ప్రీత్ సింగ్ ఉన్నారు. సెప్టెంబర్ 6న రకుల్ ప్రీత్ సింగ్, 8న దగ్గుబాటి రానా, 9న రవితేజ, నవంబర్ 15న మమైత్ ఖాన్ విచారణకు రావాల్సిందిగా నోటీసులు పంపించింది. పూర్తి ఆధారాలతో రావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొన్నది. నాలుగు సంవత్సరాల క్రితం డ్రగ్స్ పెడ్లర్ కెల్విన్ ఇచ్చిన సమాచారం మేరకు 67 మంది అనుమానితులను తెలంగాణ ఎక్సైజ్ విభాగం విచారణ జరిపింది. వీరిపై ఛార్జిషీట్లు దాఖలు చేశారు. అప్పటి నుంచి ఈ కేసు మరుగున పడి ఉంది. పూర్తి విచారణ కోసం ఈడి రంగంలోకి దిగడంతో టాలీవుడ్ లో కలకలం మొదలైంది.

Leave A Reply

Your email address will not be published.