122 మంది ప్రజా ప్రతినిధులు నిందితులు: సుప్రీం కు నివేదిక

ఢిల్లీ: ప్రజా ప్రతినిధులపై ఉన్న కేసుల స్థితిగతులపై అమికస్ క్యూరీ సుప్రీంకోర్టుకు నివేదిక అందించింది. అమికస్ క్యూరీ విజయ్ హన్సారియా నివేదిక రూపొందించారు.

మనీలాండరింగ్ కేసుల్లో 51 మంది ఎంపి లు నిందితులుగా ఉన్నట్లు తేల్చారు. వీరితో పాటు 71 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఉన్నట్లు నివేదికలో పొందుపర్చారు. సిబిఐ ప్రత్యేక కోర్టుల్లో 151 కేసులు పెండింగ్‍లో ఉన్నాయి. 58 పెండింగ్ కేసుల్లో జీవిత ఖైదు శిక్షలు విధించతగినవిగా వెల్లడించారు. 45 కేసుల్లో అభియోగాలు కూడా నమోదు కాలేదని ఆందోళన వ్యక్తం చేసింది. కేసుల విచారణకు జడ్జీలు, విచారణ సంస్థలు మానవ వనరుల కొరత సమస్య ప్రధానంగా వెంటాడుతున్నదని నివేదికలో స్పష్టం చేశారు. ప్రజా ప్రతినిధుల కేసుల్లో ఛార్జిషీట్ల దాఖలు ఎందుకు ఆలస్యం అవుతున్నదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ సిబిఐ, ఈడిలను ప్రశ్నించారు. కేసులపై హైకోర్టులు నివేదిక అందించాయని, ప్రత్యేక కోర్టుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని రమణ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.