మేడారం జాతరకు జన జాతర
వరంగల్, ఫిబ్రవరి 8: మేడారం జాతర.. సమ్మక్క సారలమ్మదర్శనం మాటల్లో చెప్పలేని ఓ మధుర జ్ఞాపకం… ఆద్యాత్మికం..ఆనందం.. ఆహ్లాదం.. ఇలా అనేక ప్రత్యేకథల సమాహారం… మొక్కులు చెల్లించుకోవడం కోసం ఆ వనదేవతల దర్శనం కోసం వచ్చే భక్తులు అడవితల్లి ఒడిలో ఎలా ఎంజాయ్ చేస్తూంటే చూడడానికి రెండు కళ్ళు చాలవు. మేడారం సమ్మక్క-సారక్క జాతర ఆంటేనే ఎదో తెలియని ఉత్సాహం…మాటల్లోచెప్పలేని పరవశం పరవళ్లు తొక్కుతోంది. చూశారు కదా వనదేవతల దర్శనం కోసం వచ్చే భక్తులు కుటుంబసమేతంగా ఎంజాయ్ చేస్తున్నారు. రెండేళ్ల కోసారి జరిగే మేడారం సమ్మక్క-సారక్క జాతరసందర్భంగా దేశం నలుమూలల నుండి భక్తులు మేడారం చేరుకుంటుంటారు.. కోరిన కోరికలు తీర్చే సమ్మక్క-సారక్క దేవతలకు మొక్కలు చెల్లించుకున్న అనంతరం మేడారం పరిసర ప్రాంతాల్లో తనివితీరాఎంజాయ్ చేస్తుంటారు.. మేడారం జాతర అంటేనే పూర్తిగా నాన్ వెజ్ జాతర.. మద్యం, మాంసాహారాలు సర్వసాధారణం.
మేడారం చుట్టూ దట్టమైన అడవి, పక్కనే జంపన్నవాగు, చిన్న చిన్న సెలయేర్లుకనిపిస్తాయి.. కుటుంబసమేతంగా వనదేవతల దర్శనం కోసం వచ్చే భక్తులు ఇక్కడ ప్రకృతి అందాల మధ్య వత్సమైన వాతావరణంలో తెగ ఎంజాయ్ చేస్తుంటారు..అడవిలో స్వయం పాకం చేసుకొని ఇక్కడే
ఒకరోజంతా గడిపి ఆనందంతో ఉప్పొంగిపోతుంటారు.. ఎన్ని ఇబ్బందులు వున్నా మేడారం పరిసర ప్రాంతాల్లో అడుగుపెట్టగానే మనసు పలకరించిపోతుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వృత్తి రీత్యా ఎక్కడెక్కడో స్థిర పడ్డ వారంతా ఈ జాతర సందర్భంగా ఒక్కటవుతారు.. సామూహికంగా సమ్మక్క సారక్క దేవతలను దర్శించుకొని తనివితీరా పరవశించి పోతుంటారు.. చిన్నా పెద్దా.. ఆడ – మగ వయో బేధం లేకుండా ఇలా నృత్యాలు చేస్తూ మేడారం జాతరను ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తున్నారు. ముందస్తు మొక్కలు చెల్లించుకుంటున్న భక్తులు.. అమ్మవార్లకు మొక్కలు చెల్లించిన అనంతరం అడవుల్లో సహపంక్తి భోజనాలు చేసి ఆటా- పాటలతో ఎలా ఎంజాయ్ చేస్తున్న విధానం చూడాలంటే.. ఈ నెల 16 నుంచి జరిగే మేడారం జాతరకు తరలి వెళ్ళాల్సిందే.