*బదిలీపై వెళుతున్న CP సత్యనారాయణకి వీడ్కోలు..*
ఘనంగా సన్మానించిన మంత్రి గంగుల,
మానకొండూర్ ఎమ్మెల్యే డా.రసమయి
కరీంనగర్ CP గా విధులు నిర్వర్తించి బదిలీపై వెళ్తున్న CP సత్యనారాయణకి వీడ్కోలు పలుకుతూ నూతన సిపిగా బాధ్యతలు చేపట్టిన సుబ్బారాయుడుకి స్వాగతం పలుకుతూ ఈరోజు పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఆత్మీయ సమ్మేళనం జరిగింది
ఈకార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర బీసీ సంక్షేమ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ మరియు రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్,మానకొండూర్ శాసనసభ్యులు డా.రసమయి బాలకిషన్ CP లు సత్యనారాయణ మరియు సుబ్బారాయుడులను ఘనంగా సన్మానించారు..