కేటీఆర్ మామకు నివాళులర్పించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వియ్యంకులు, భారత రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక, ఐటి, పరిశ్రమల శాఖామాత్యులు కేటిఆర్ మామ పాకాల హరినాథరావు(74) ఇటీవల గుండెపోటుతో మరణించగా నేడు పెద్ద కర్మ సందర్భంగా హైదరాబాద్, జే ఆర్ సి కన్వెన్షన్ సెంటర్లో వారి చిత్రపటం వద్ద *రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు * రాష్ట్ర గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ పూలు చల్లి నివాళులు అర్పించారు. ఆయన మృతి పట్ల సంతాపం తెలిపారు. కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేశారు. మంత్రి కేటిఆర్కు ధైర్యం చెప్పారు. హరినాథరావు గారి ఆత్మ శాంతించాలని భగవంతున్ని ప్రార్థించారు._

మంత్రులతో పాటు ఎంపీ శ్రీమతి మాలోతు కవిత, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి , బసవ రాజు సారయ్య, ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, శ్రీమతి హరిప్రియ నాయక్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీమతి గుండు సుధారాణి, వరంగల్ జెడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి గండ్ర జ్యోతి, చైర్మన్లు నాగుర్ల వెంకన్న, సతీష్ రెడ్డి, వాసుదేవ రెడ్డి, మాజీ ఎంపీ ప్రొఫెసర్ సీతారాం నాయక్, మాజీ చీఫ్ విప్ బొడేకుంటి వెంకటేశ్వర్లు, ఇతర నాయకులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.