కానిస్టేబుల్ షకీల్ జన్మదిన సందర్భంగా బ్రెడ్ బిస్కెట్లు పంపిణీ

కానిస్టేబుల్ షకీల్ జన్మదిన సందర్భంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో లైన్స్ క్లబ్ ఆఫ్ గజ్వేల్ స్నేహ ఆధ్వర్యంలో అల్పాహార పంపిణీ చిన్నారులకు బిస్కెట్ల పంపిణీ చేశారు ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ గజ్వేల్ స్నేహ అధ్యక్షుడు మతిన్ మాట్లాడుతూ వివాహ వేడుకలు జన్మదిన వేడుకలను ప్రతి ఒక్కరు ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో జరుపుకుంటూ రోగులతో వచ్చిన సహాయకులకు సహాయ సహకారాలు చేయాలని తెలిపారు.
జోనల్ చైర్మన్ డాక్టర్ గోలి సంతోష్ కుమార్ మాట్లాడుతూ అధ్యక్షుడు మతిన్ ఆధ్వర్యంలో దాదాపుగా 182 రోజుల నుండి ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ప్రతిరోజు దాదాపు 150 మందికి అల్పాహారం కార్యక్రమం చేయడం పరిచయం ఉన్న ప్రతి వ్యక్తి ఇక్కడికి వచ్చి జన్మదిన వేడుకలు జరుపుకుంటూ పండ్లు బిస్కెట్లు బ్రెడ్ పంపిణీ చేయడం పలువురికి ఆదర్శనీయమని తెలిపారు కార్యక్రమంలో లైన్స్ క్లబ్ నాయకులు దొన్తుల సత్యనారాయణ నేతి శ్రీనివాస్ సామా శ్రీధర్ కాసం రాములు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.