90 గ్రాముల వెండితో పట్టుచీర – సిరిసిల్ల నేత కార్మికుడి అద్భుత సృష్టి

సిరిసిల్ల నేత కార్మికుడి అద్భుత సృష్టి

సిరిసిల్ల: వెండిపోగులతో మెరిసిపోతోంది. పరిమళాలు వెదజల్లుతోంది. సిరిసిల్ల నేత కళాకారుడి చేయి మరో అద్భుతాన్ని సృష్టించింది.. వెండితో పరిమళించే సిరి చందనం పట్టుచీర సో యగాలొలుకుతోంది. అగ్గిపెట్టెలో ఇమిడే చీరను నాలుగు దశాబ్దాల కిందటే నేసి ప్రపంచానికి సిరిసిల్ల చేనేత కళా వైభవాన్ని చాటిచెప్పిన నల్ల పరంధాములు తనయుడు నల్ల విజయ్‌కుమార్‌.. తాజాగా వెండిపోగులతో పరిమళించే పట్టుచీరను మగ్గంపై నేశాడు.

రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి తల్లి జ్యోతి వెండిపోగుల సిరిచందనం పట్టు చీరను ఆర్డర్‌ ఇచ్చారు. ఈ మేరకు విజయ్‌కుమార్‌ నెల పది రోజులపాటు శ్రమించి 90 గ్రాముల వెండితో పోగులను సిద్ధం చేసి, 27 రకాల పరిమళాలతో కూడిన నూలు పోగులతో పట్టుచీరను నేశాడు. 600 గ్రాముల బరువుతో, 48 ఇంచీల వెడల్పుతో ఐదున్నర మీటర్ల పొడవైన వెండిపోగుల చీరను సిద్ధం చేశాడు. కట్టుకోవడానికి వీలుగా ఉండే ఈ చీర తయారీకి రూ.45 వేలు ఖర్చయినట్లు నల్ల విజయ్‌కుమార్‌ తెలిపారు. చీరను కలెక్టర్‌ తల్లి జ్యోతికి అందజేస్తానని ఆయన గురువారం తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.