శ్రీ వాణి టికెట్ల కుదింపు

తిరుమల: శ్రీవారి దర్శనం విషయంలో సామాన్య భక్తులకు మరింత ప్రాధాన్యం పెంచేందుకు వీలుగా శ్రీవాణి దర్శన టికెట్లను తితిదే రోజుకు వెయ్యికి పరిమితం చేసింది. ఇందులో ఆన్‌లైన్‌లో 750, ఆఫ్‌లైన్‌లో 250 టికెట్లు జారీ చేస్తారు. ఇప్పటికే తితిదే 500 టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేయగా, ఈనెల 11న మరో 250 టికెట్లు విడుదల చేయనుంది. మాధవం విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల కేటాయింపును తితిదే రద్దు చేసింది. శ్రీవాణి దాతలకు విమానాశ్రయంలో కరెంట్‌ బుకింగ్‌ కౌంటర్‌ను అందుబాటులో ఉంచారు. బోర్డింగ్‌ పాస్‌ ద్వారా తిరుపతి ఎయిర్‌పోర్ట్‌ కౌంటర్‌లో మాత్రమే ఆఫ్‌లైన్‌ టికెట్లు జారీ చేస్తారు. వైకుంఠం క్యూకాప్లెంక్స్‌లోని సిబ్బంది బ్రేక్‌ దర్శన టికెట్‌తో పాటు బోర్డింగ్‌ పాసును తనిఖీ చేసి దర్శనానికి అనుమతిస్తారు.

* తిరుమల శ్రీవారి ఆలయంలో తిరుప్పావడ ఆర్జిత సేవ ఈ నెల 12 నుంచి పునఃప్రారంభం కానుంది. ఇందుకోసం యాత్రికులు తిరుమలలోని సీఆర్వో కౌంటర్‌లో పేర్లు నమోదు చేసుకోవాలి. వీరికి ఈనెల 11న సాయంత్రం 5 గంటలకు ఎలక్ట్రానిక్‌ డిప్‌ ద్వారా 25 టికెట్లు జారీ చేస్తారు.

Leave A Reply

Your email address will not be published.