వ్యాపార లావాదేవీల‌కు సింగిల్ ఐడెంటిటీ పాన్ కార్డు.

వ్యాపార లావాదేవీల‌కు సింగిల్ ఐడెంటిటీ పాన్ కార్డు.

*🍥PAN Card | ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌తియేటా వేత‌న జీవులు, వ్యాపారులు, కార్పోరేట్ సంస్థ‌లు ఐటీ రిట‌ర్న్స్ దాఖ‌లు చేయ‌డానికి `పాన్ కార్డ్ లేదా ప‌ర్మినెంట్ అకౌంట్ నంబ‌ర్ ( PAN card ) తప్పనిసరి. ఇక ఆ ప‌రిస్థితి మారిపోనున్న‌ది. ఏ వ్యాపార లావాదేవీ నిర్వ‌హించాల‌న్నా.. అన్ని ర‌కాల వ్యాపారాల గుర్తింపు ప్ర‌క్రియకు పాన్ కార్డ్ తప్ప‌నిస‌రి చేయ‌నున్న‌ది కేంద్ర ప్ర‌భుత్వం. 2023-24 ఆర్థిక సంవ‌త్స‌రానికి వ‌చ్చేనెల ఒక‌టో తేదీన బ‌డ్జెట్ ప్ర‌తిపాద‌న‌లు స‌మ‌ర్పించ‌నున్న ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్.. ఇందుకోసం లీగ‌ల్ ఫ్రేమ్‌వ‌ర్క్ ప్ర‌తిపాదిస్తార‌ని స‌మాచారం.*

*🌀ఇప్ప‌టి వ‌ర‌కు వివిధ వ్యాపార లావాదేవీలు నిర్వ‌హించే వ్యాపారులు, ఇన్వెస్ట‌ర్లు.. ఆయా ప్రాజెక్టుల‌కు క్లియ‌రెన్స్‌, అధికారులు, శాఖ‌ల నుంచి అప్రూవ‌ల్ పొంద‌డానికి నేష‌న‌ల్ సింగిల్ విండో సిస్ట‌మ్ కింద ఒక‌టి కంటే ఎక్కువ గుర్తింపు ప‌త్రాలు స‌మ‌ర్పించాల్సి వ‌స్తున్న‌ది. ఇక నుంచి ఇన్వెస్ట‌ర్లు, వ్యాపారుల‌కు ఆ బాధ లేకుండా `పాన్ కార్డ్‌` ఒక్క‌టే స‌మ‌ర్పించేలా.. విత్త మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌.. `ఫైనాన్స్ యాక్ట్-2023`లో నిబంధ‌న చేరుస్తార‌ని తెలుస్తున్న‌ది. ఏదేనీ సంస్థ‌ను గుర్తించాలంటే `పాన్ కార్డు` ఉంటే చాలు అనే నిబంధ‌నకు చ‌ట్ట‌బ‌ద్ధ‌త చేకూర్చ‌నున్నారు.*

*💠ఈ విష‌య‌మై ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మెరుగుద‌ల‌కు కేంద్ర ఆర్థిక‌శాఖ రెవెన్యూ విభాగం అద‌న‌పు కార్య‌ద‌ర్శి సార‌ధ్యంలోని వ‌ర్కింగ్ గ్రూప్ సిఫార‌సులు చేసింది. ఆ సిఫార‌సుల ప్ర‌కార‌మే బిజినెస్ లావాదేవీల గుర్తింపున‌కు పాన్ కార్డ్ చ‌ట్ట‌బ‌ద్ధం చేస్తార‌ని వినికిడి. దీని ప్ర‌కారం ఒక వ్యాపార సంస్థ లేదా ఒక కార్పొరేట్ సంస్థ రిజిస్ట్రేష‌న్‌, లైసెన్స్‌, దాని ప్రారంభానికి అధికారిక క్లియ‌రెన్స్‌ల‌కు పాన్ కార్డు ప్రాధ‌మిక గుర్తింపు కార్డుగా ప‌రిగ‌ణిస్తారు. ఈ ప్ర‌క్రియ ద‌శ‌ల వారీగా అమ‌లు చేయాల‌ని స‌ద‌రు వ‌ర్కింగ్ గ్రూప్ సూచించిన‌ట్లు తెలుస్తున్న‌ది.*

Leave A Reply

Your email address will not be published.