టీకాంగ్రెస్‌..కయ్యాలకు మారుపేరు.

టీకాంగ్రెస్‌..కయ్యాలకు మారుపేరు. పార్టీ భ్రష్టుపట్టినా.. తమకంటే జూనియర్లు ఎదగకూడదనే నేతలలు ఉన్న ఏకైక పార్టీ వచ్చే ఎన్నికల నాటికి పార్టీని గాడిన పెట్టాలని, ప్రజల మద్దతు కూడగట్టాలని రేవంత్‌ భావిస్తుంటే.. ఆయన కాళ్లు పట్టుకుని లాగేందుకు గోటికాటి నక్కలా కాచుకూర్చున్నారు సీనియర్లు.. ఇప్పటికే తామే అసలైన కాంగ్రెస్‌ వాదులం అంటూ సంక్షోభానికి తెరలేపిన అసమ్మతి వర్గం.. తాము ఎదగకపోయినా పరవాలేదు.. రేవంత్‌రెడ్డి మాత్రం ఎదగకూడదన్న భావనలో ఉన్నారు. వీలైతే రేవంత్‌ను తొక్కేద్దాం అన్నంత కసిగా తమ ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా రేవంత్‌ పాదయాత్ర అనడడంతోనే సీనియర్లు కూడా అదే రాగం అందుకున్నారు. తాము కూడా తమ నియోజకవర్గాల్లో పాదయాత్ర చేస్తాంటున్నారు. ఇన్నాళ్లూ పార్టీ బలోపేతానికి ఒక్క కార్యక్రమం కూడా చేయని నేతలు రేవంత్‌ యాత్ర అనగానే.. వారికీ యాత్రలు గుర్తొచ్చాయి. కలసి పనిచేయాల్సిన చోట కయ్యం షురూ చేస్తూ పార్టీని సర్వ నాశంన చేయాలన్న సంకల్పమే సీనియర్లలో ఎక్కువగా కనిపిస్తోంది.
రేవంత్‌రెడ్డి నెల క్రితమే పాదయాత్ర తేదీ ప్రకటించారు. ఇందుకు అధిష్టానం అనుమతి తీసుకున్నాడు. కానీ టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌కుమార్‌ మాత్రం ఒకసారి యాత్రకు అనుమతి ఉందని, మరోసారి అనుమతి లేదని ప్రకటించి గందరగోళానికి తెరలేపారు. రాహుల్‌యాత్ర సందర్భంగా అంతా ఐక్యంగా కనిపించి రేవంత్‌ యాత్ర అనగానే నేనంటే నేను అంటూ ముందుకొస్తున్నారు. కాంగ్రెస్‌ను కుక్కలు చింపిన విస్తరి చేయాలన్న సంకల్పంతో గట్టిగా పనిచేస్తున్నట్టుగా కనిపిస్తుంది.

ఎదుటోడి ఎదుగుదలపై ఉన్నశ్రద్ధ పార్టీపై లేకనే..
కాంగ్రెస్‌ నేతల్లో ఓర్వలేని తనం ఎక్కువ. తమకంటే వెనుక వచ్చిన నేత పదవులు వచ్చినా.. జనాదరణ పెరుగుతున్నా… బలమైన నేతగా మారుతున్నా.. సీనియర్లు ఓర్వలేకపోతున్నారు. ఇప్పుడు రేవంత్‌ విషయంలో అదే జరుగుతోంది. టీడీపీ నుంచి వచ్చి పీసీసీ చీఫ్‌ అయ్యాడని, ఇటీవలి కమిటీల్లో తన వర్గంవారికే పదవులు ఇప్పించుకున్నాడని అసంతృప్తితో ఉన్న సీనియర్లు ఎలాగైనా రేవంత్‌ ఎదగకుండా చేయాలని చూస్తున్నారు.ఈపాటి శ్రద్ధ ఎనిమిదేళ్లుగా పార్టీ బలోపేతం, ప్రజాసమస్యల పరిష్కారం, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంపై సీనియర్లు… పెట్టి ఉంటే కాంగ్రెస్‌కు తిరుగు ఉండేది కాదు. అలా చేస్తే వారు కాంగ్రెస్‌ నేతలు ఎందుకవుతారు మరి!

Leave A Reply

Your email address will not be published.