కళ్యాణంకు ముస్తాబోతున్న శ్రీ రేణుక మాత దేవాలయం
22 జనవరి ఆదివారం ముగ్గుల పోటీల కార్యక్రమం
యాదాద్రి భువనగిరిజిల్లా కాచారం శ్రీ రేణుకఎల్లమ్మ దేవాలయంలో శనివారం ఆలయ అర్చక స్వామి వంగపల్లి అంజయ్య స్వామి అధ్వర్యంలో గ్రామసర్పంచ్ కొండం అరుణ అశోక్ రెడ్డి దేవాలయం సందర్శించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం మాట్లాడుతూ ప్రతి ఏటా నిర్వహించే ఆలయ వార్షిక కళ్యాణ ఉత్సవాలలో భాగంగా 26వ వార్షికోత్సవమ్ సందర్భంగా తేదీ 22- 1- 2023 ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో మహిళలకు ముగ్గుల పోటీల కార్యక్రమము నిర్వహించనున్నారని పోటీలో పాల్గొన్న విజేతలకు ఎస్ ఎన్ తెలుగు న్యూస్ ఛానల్ యాజమాన్యం ద్వారా బహుమతుల ప్రధానం ఉంటుందని మరియు వచ్చేనెల ఫిబ్రవరి12వ తేదీన కళ్యాణ మహోత్సవం వేడుకలు ఘనంగా జరగనున్నాయని,ఇట్టి వార్షికోత్సవానికి అధిక సంఖ్యలో భక్తులు ప్రజలు ప్రజాప్రతినిధులు పాల్గొని అమ్మవారి కృపా కటాక్షాలు పొందగలరని అన్నారు. కార్యక్రమంలో బాల్ద సిద్దులు(పెద్ద కుర్మ),రైతు సంఘం నాయకులు అంన్రెడ్డి రాంరెడ్డి, మల్లికార్జున దేవాలయ వ్యవస్థాపకులు దుంపల రాజిరెడ్డి, పోరెడ్డి సిద్దులు,నీళ్ల వెంకటేష్ గౌడ్,తదితరులు పాల్గొన్నారు