వివేకాందరెడ్డి హత్య కేసు నిందితులకు హైకోర్టులో ఎదురుదెబ్బ

అమరావతి ఫిబ్రవరి 16: వైఎస్ వివేకాందరెడ్డి హత్య కేసు నిందితులకు ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. సీబీఐకి దస్తగిరి అప్రూవర్‌గా మారడాన్ని సవాల్ చేస్తూ నిందితులు ఉమాశంకర్‌రెడ్డి, గంగిరెడ్డి వేసిన వ్యాజ్యాలను న్యాయస్థానం కొట్టివేసింది. సీబీఐకి దస్తగిరి అప్రూవర్‌గా మారేందుకు.. అనుమతించడాన్ని ఉమాశంకర్‌రెడ్డి, గంగిరెడ్డి సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు.

దీనిపై బుధవారం విచారణ జరిపిన న్యాయస్థానం వ్యాజ్యాలను కొట్టివేసింది. కాగా దస్తగిరి నేరాంగీకార పత్రంలో సంచలన అంశాలు వెలుగులోకి వచ్చాయి. వైఎస్ వివేకా హత్యకు జరిగిన కుట్రను దస్తగిరి వివరించారు.

Leave A Reply

Your email address will not be published.