లోపాయికారి ఒప్పందంతో ఉద్యమాన్ని నీరుగార్చిన ద్రోహుల చిత్రపటాల దహనంతో నిరసన

ఎమ్మిగనూరు: పట్టణంలో పిఆర్సి పేరుతో జీతాల లో విధించిన కోతలకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ఉద్యోగ, ఉపాధ్యాయ,  పెన్షనర్లు, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు మూడవ తేదీన చలో విజయవాడ అంటూ బి ఆర్ టి ఎస్ రోడ్డులో సింహగర్జన చేయగా 5వ తేదీన పీఆర్సీ సాధన సమితి స్టీరింగ్ కమిటీ సభ్యులు పాలకులతో లోపాయికారి ఒప్పందంతో ఉద్యమాన్ని నీరుగార్చి సమ్మెను విరమింపచేయడాన్ని సగటు ఉద్యోగి జీర్ణించుకోలేక పిఆర్సి సాధన సమితి నాయకత్వంపై తిరుగుబాటు బావుటా పూరించడం జరిగింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఏపిటిఎఫ్ గా ఎమ్మిగనూరు ప్రాంతీయ కమిటీ పక్షాన సోమప్ప కూడలిలో ఈ సాయంత్రం ఉద్యమ ద్రోహుల చిత్రపటాలను, చీకటి ఒప్పందాల పత్రాలను దహించి వేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ఏపిటిఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ రవికుమార్ మాట్లాడుతూ కింది స్థాయి ఉద్యోగులు నిర్మించిన చారిత్రాత్మకమైన ఉద్యమాన్ని నీరుగార్చిన పిఆర్సి సాధన సమితి స్టీరింగ్ కమిటీ సభ్యులు ఉద్యోగుల పక్షాన సమస్యలను పరిష్కరించాల్సి ఉంది పోయి పాలకుల దగ్గర మోకరిల్లి ఉద్యమాన్ని నీరుగార్చి ఉద్యమ ద్రోహులగా నిలిచారని,  పదవులలో కొనసాగే నైతిక అర్హత లేదని తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేయడం జరిగింది.

జిల్లా ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సగటు ఉద్యోగులలో ఉన్న అసంతృప్తిని ఉద్యమంగా మలచి సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాటం సాగించాలని కోరడం జరిగింది. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శులు పాపన్న, కాసింజీ, ఎం డి శ్రీనివాసులు, పాండురంగ, ఎమ్మిగనూరు మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శ్రీనివాసులు, రాఘవరెడ్డి, నారాయణ, రాఘవేంద్ర బసవరాజు, రామన్న, యూపీ నర్సింహులు, ధనరాజు, పరశురామ్, నాగరాజు, జట్టప్ప, సోమేశ్, జగదీష్, సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొనడం జరిగింది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.