ఏపీలో స్పెషల్ స్టేటస్‌పై పాలిటిక్స్

విజయవాడ, ఫిబ్రవరి 17: ఏపీలో స్పెషల్ స్టేటస్‌పై మళ్ళీ పాలిటిక్స్ నడుస్తున్నాయి..హోదాని సాధించే పని చూడకుండా రాజకీయ పార్టీలు కేవలం రాజకీయం నడపడంలోనే ముందు ఉన్నాయి..అధికార వైసీపీ కావొచ్చు…ప్రతిపక్ష టీడీపీ కావొచ్చు..అలాగే జనసేన కావొచ్చు..ప్రతి పార్టీ హోదాపై రాజకీయం చేస్తున్నాయి తప్ప..పొరాడి ఎలా సాధించాలనే కార్యక్రమం చేయడం లేదు. అసలు హోదా ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తున్న విషయం తెలిసిందే. గతంలో చంద్రబాబు అధికారంలో ఉండగా, హోదా ఇవ్వలేం, ప్యాకేజ్ ఇస్తామని చెప్పారు. సరే బాబు కూడా ప్యాకేజ్‌కు ఒప్పుకున్నారుకానీ వేరే రాష్ట్రాలకు హోదా ఇస్తూ, ఏపీకి మాత్రం ఇవ్వలేమని చెప్పడంతో చంద్రబాబు సైతం, కేంద్రంపై పోరాటం చేశారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న జగన్ సైతం పోరాడారు. కాకపోతే ఒకరిపై ఒకరు పోరాడారు తప్ప…కేంద్రంపై మాత్రం పోరాడలేదు. ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నా సరే హోదాపై పోరాటం చేయడం లేదు.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం తెగ హడావిడి చేసేశారు..అసలు మా జగనన్నకు అధికారం ఇస్తే హోదా సాధించేస్తారని వైసీపీ కార్యకర్తలు బాగా ప్రచారం చేశారు.కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక మాత్రం అసలు నోరు తెరవడం లేదు…హోదాపై పోరాడితే కేంద్రం ఎక్కడ ఇబ్బంది పెడుతుందనే భయం వైసీపీలో ఉన్నట్లు ఉంది. ఇటు టీడీపీ సైతం అదే తీరులో ఉంది…బీజేపీతో మళ్ళీ కలవాలని చూస్తూ, హోదాపై పోరాటమే చేయడం లేదు. ఇక జనసేన ఎలాగో బీజేపీతో పొత్తులో ఉంది. ఇలా మూడు పార్టీలు ఏదొకవిధంగా బీజేపీతో లాలుచీ పడుతూనే ఉన్నాయి.దీంతో హోదా అంశం ఇప్పటికీ తేలడం లేదు…తాజాగా విభజన హామీల ఎజెండాలో పెట్టి హోదా అంశాన్ని తీసేశారు. దీనిపై కేంద్రంతో పోరాడకుండా వైసీపీ-టీడీపీలు ఒకరిపై ఒకరిపై విమర్శలు చేసుకుంటున్నారు. మళ్ళీ స్టేటస్‌పై రాజకీయం చేస్తూ హోదా అంశాన్ని పక్కదారి పట్టిస్తున్నాయి. ఇలా రెండు పార్టీల రాజకీయంగా మళ్ళీ మోసపోయేది ప్రజలే అని చెప్పొచ్చు. హోదా విషయంలో పదే పదే ముంచుతూనే ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.