వైకాపా అరాచకాలకు ప్రజలే గుణపాఠం చెప్తారు

జనసేన జిల్లా ఇన్ చార్జ్ మను క్రాంత్ రెడ్డి

నెల్లూరు: రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వ అరాచకాలకు అంతే లేకుండా పోయిందని ,రానున్న 2024 ఎన్నికల్లో ప్రజలే వైకాపాకు బుద్ధి చెబుతారని జనసేన జిల్లా అధ్యక్షులు మనుక్రాంత్ రెడ్డి పేర్కొన్నారు.మినీ బైపాస్ రోడ్డు ప్రాంతంలో ఉన్న జనసేన జిల్లా కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన 3 సంవత్సరాల వైకాపా ప్రభుత్వంలో నియంత్రణ లేని ధరలు, అద్వానంగా రోడ్లు, రైతులకు గిట్టుబాటు ధర కల్పించలేని పరిస్థితి, అమలుకాని మద్యపాన నిషేధం లతో రాష్ట్ర ప్రజలు పరిస్థితి చిన్నాభిన్నం అయిందన్నారు.

ఈ క్రమంలో రానున్న ఎన్నికల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని, ఓటు అనే ఆయుధంతో తప్పకుండా వైకాపాకు బుద్ధి చెప్తారని పేర్కొన్నారు. ప్రత్యేకంగా మత్స్యకారులు ఉపాధి కోల్పోయిన పరిస్థితి రాష్ట్రంలో స్పష్టంగా కనిపిస్తోందన్నారు. సాధారణ ప్రజల పరిస్థితి ఇలా ఉండగా ఉద్యోగ ఉపాధ్యాయుల పరిస్థితి మరి అధ్వానంగా ఉంది అన్నారు. రాష్ట్రంలో పిఆర్సి రగడ పై ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు ఇటీవల చేసిన నిరసనలు ఆందోళనలకు ప్రభుత్వం చేసిన న్యాయం ఏమీ లేదని వ్యాఖ్యానించారు. వివిధ అభివృద్ధి సంక్షేమ పనులకు గాను తమ కాంట్రాక్టు పనులను పూర్తి చేసినప్పటికీ బిల్లు రాకపోవడంతో సదరు కాంట్రాక్టర్ల పరిస్థితి అయోమయంగా ఉందన్నారు.

Leave A Reply

Your email address will not be published.