భారీగా నగదు స్వాధీనం

ప్రైవేటు ట్రావెల్ బస్సులో నగదు పట్టివేత
కర్నూలు పట్టణ శివారులోని పంచాలింగాల అంతరాష్ట్ర సరిహద్దు ఎస్ఈబి చెక్ పోస్ట్ వద్ద బుధవారం తెల్లవారుజామున సి ఐ మంజుల, యస్ ఐ ప్రవీణ్ కుమార్ నాయక్ జరిపిన వాహన తనిఖీల్లో భారీ నగదు దొరికింది. హైదరాబాదు నుండి తిరుపతి కు వెళుతున్న ఓ ప్రవేటు ట్రావెల్ బస్సులో తనిఖీ చేయగా అందులో కర్ణాటక రాష్ట్రం, చిచ్చోలి గ్రామం,గుల్బర్గా జిల్లాకు చెందిన కిషోర్ కుమార్ అనే వ్యక్తి బ్యాగులో ముప్పైలక్షల రూపాయలు నగదును గుర్తించారు. తాను హైదరాబాదు లోని ఓ బంగారు షాప్ లో గుమస్తా గా పనిచేస్తున్నాడని అన్నారు.

తన యజమాని ఈ నగదును తిరుపతి లో వున్న యజమాని స్నేహితునికి ఇచ్చి రమ్మాడని తెలిపాడు. ఈ డబ్బుకు సంబంధించి ఎలాంటి పత్రాలు లేవని చెప్పాడు. పట్టుబడిన నగదు ను తగిన ఆధారాల ధృవీకరణ పత్రాల పరిశీలన కొరకు కర్నూల్ తాలూకా పోలీసు స్టేషన్ కు అప్పగించారు.

Leave A Reply

Your email address will not be published.