కరోనా కేసులు తగ్గినా… వైసీపీ అక్రమ కేసులు తగ్గడం లేదు

టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ

అమరావతి: రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గినా వైసీపీ ప్రభుత్వ అక్రమ కేసులు మాత్రం తగ్గడం లేదని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ వ్యాఖ్యానించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యాల్ని, తప్పుల్ని పశ్నించినందుకే టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబుపై తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేశారని అన్నారు. ఎన్నికల అఫడవిట్‌లో బి.కామ్ పూర్తి చేసినట్టు అశోక్ బాబు ఎక్కడా చెప్పలేదని, రాజకీయ కుట్రతోనే అక్రమ కేసు పెట్టారని ఆరోపించారు.

పీఆర్సీ అంశంలో ఉద్యోగులకు చేసిన మోసం, అన్యాయంపై ప్రభుత్వ తీరును ఎండగట్టినందుకు ఆయనపై కక్ష్యసాధిస్తున్నారన్నారు. ఉద్యోగులకు న్యాయం చేయమంటే అక్రమ కేసులు పెడతారా? ఇదేం పాలన అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పద్ధతి మార్చుకుని పాలన సాగించకపోతే ప్రజల చేతిలో తగిన మూల్యం చెల్లించక తప్పదని పంచుమర్తి అనురాధ హెచ్చరించారు.

Leave A Reply

Your email address will not be published.