చెడ్డి గ్యాంగ్ సభ్యుడు అరెస్టు

తిరుపతి: చెడ్డి గ్యాంగ్ లోని ఒక నేరస్తుడ్ని తిరుచానూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తిరుపతి పట్టణంలో ఈ మద్య కాలములో చెడ్డీ గ్యాంగ్ రాత్రి సమయాలలో కొన్ని దొంగతనలు చేసిన విషయం తెలిసిందే. చెడ్డీ గ్యాంగ్ ను పట్టుకోవడానికి తిరుపతి ఈస్ట్ సబ్ డివిజన్ ఎస్.డి.పి.ఓ మురళి కృష్ణ ఆద్వర్యంలో,ప్రత్యేక టీమ్ లను ఏర్పాటు చేసారు.

తిరుచానూరు ఎస్.ఐ రామకృష్ణ రెడ్డి, సిబ్బంది చెడ్డీ గ్యాంగ్ సభ్యుడు మదీయ భాయ్ కమజి భాయ్ మేద ను అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు ఈ చెడ్డీ గ్యాంగ్ లోని మరో ఇద్దరు సభ్యులు కంలేష్ బబురియ ఉరఫ్ కంలేశ్ ఉరఫ్ కంలా, సక్ర మందొడ్ లను ఇది వరకే రిమాండ్ కి పంపారు.. ఈ చెడ్డీ గ్యాంగ్ తిరుపతి లోనే కాకుండా ఏపీ, తెలంగాణ, కర్నాటక రాష్ట్రాలలోఅనేక నేరాలకు పాల్పడింది.

Leave A Reply

Your email address will not be published.