బండి సంజయ్ మౌన దీక్ష

న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఢిల్లీ తెలంగాణ భవన్ లో గురువారం ఉదయం మౌన దీక్ష చేపట్టారు. ముందుగా ఢిల్లీ తెలంగాణ భవన్ లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తరువాత అయన తెలంగాణ భవన్ లోనే ఒక గంట పాటు దీక్ష కు కూర్చున్నారు. నోటికి నల్ల బ్యాడ్జీలు కట్టుకొని నిరసన దీక్ష చేపట్టారు. అలాగే తెలంగాణ బీజేపీ ఆఫీసులో బీజేపీ నేతలు లక్ష్మణ్, రాజాసింగ్ లు, పొంగులేటి సుధాకర్ రెడ్డి, మాజీ మంత్రి వివేక్, ప్రేమేందర్ రెడ్డి తదితరులు, జిల్లా, మండల కేంద్రాల్లో బీజేపీ నేతలు దీక్షలకుదిగారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ .. భారత రాజ్యంగంపై చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడ్డారు. దేశ రాజ్యంగాన్ని మార్చాలన్న. సీఎం కేసీఆర్ క్షమాపణలు చెప్పాల్సిందేనని బీజేపీ డిమాండ్ చేసారు.,

Leave A Reply

Your email address will not be published.