సంక్రాంతి సందర్భంగా జరగబోయే కోడి పందేలను అధికారులు నివారించేనా

సాంప్రదాయ క్రీడలను ప్రోత్సహించాలి – సామాజిక కార్యకర్త మెటికల శ్రీనివాసరావు
జగ్గయ్యపేట నియోజకవర్గ పరిధిలో జగ్గయ్యపేట పట్టణంలో,షేర్ మహమ్మద్ పేట,చిల్లకల్లు,లింగాల, పెనుగంచిప్రోలు కేంద్రంగా బారీ ఎత్తున కోడి పంథ్యాల బరులు ఏర్పాటు జరగబోతున్నాయని తెలుస్తుంది.వీటితోపాటు నియోజకవర్గ పరిధిలో సుమారు ఏడుకు పైగా బరులు రెడీ కాబోతున్నట్లు ప్రజలు తెలియజేస్తున్నారు.ఈ కోడి పంథ్యాల పేరుతో ఏర్పాటు చేయబడుతున్న బరులలో కోడి పంథ్యాలతో పాటుగా చట్ట వ్యతిరేక క్రీడలైన పంథ్యాం కోళ్ళకు కాళ్ళకు కత్తులు కట్టడం, పేకాట,గుండాటా,మట్కా,లోనాబయట,కాయిరాజా కాయి,మూడు ముక్కలాట లాంటి ఆడుతున్నట్లుగా పలువురు నుండి తెలుస్తుంది.వీటిలో పాల్గొని బెట్టింగ్ లు పెట్టటానికి స్థానికులే కాకుండా తెలంగాణ రాష్ట్రం నుండి సైతం ఈ ప్రాంతానికి తరలివచ్చి కోట్ల రూపాయలు సంక్రాంతి పండుగ సందర్భంగా చేతులు మారే పరిస్థితిలున్నాయని ప్రజల నుండి వినికిడి.ఇటువంటి చట్ట వ్యతిరేక బరులు ఏర్పాటు చేసి ఆడించే పంథ్యాలను అధికారులు అరికట్టే చర్యలను చేపట్టాలని,కోర్టు లు సైతం ఇటువంటి వాటిని సుమోటోగా స్వీకరించి చట్టపరమైన చర్యలను తీసుకోవాలని ప్రజల నుండి వాదనలు వినిపిస్తున్నాయి.సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పంథ్యాలలో కోళ్ళకు కత్తులు కట్టి పంథ్యాలు వేయడం,వాటిని హింసించి,వాటి పై డబ్బులు పెట్టి ఆనందించే చర్యల పై పక్షి ప్రేమికులు తీవ్రంగా ఖండిస్తున్నారు.కబాడీ,కోకో,మహిళలకు రంగవళీలు, కూచిపూడి నృత్యం లాంటి సంక్రాంతి పండుగ సాంప్రదాయ క్రీడలను అధికారులు ప్రోత్సహించాలని పలువురు మేదావులు,సామాజిక కార్యకర్తలు కోరుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.