రాజుపాలెంలోని గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పోటెత్తిన భక్తులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లా రాజుపాలెం పట్టణ కేంద్రంలో గల శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేశారు పండుగను పురస్కరించుకొని దేవాలయానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించినట్లు దేవాలయం ట్రస్ట్ చైర్మన్ పొత్తూరి వెంకట రామ సుబ్బారావు దంపతులు తెలియజేశారు
ఈ సందర్భంగా పొత్తూరి దంపతులు మాట్లాడుతూ ఎంతో మహిమాన్వితమైన ఈ దేవాలయాన్ని పలు ప్రాంతాల నుండి వచ్చి దర్శించుకుని ప్రత్యేక పూజ కార్యక్రమం నిర్వహించుకుంటారని ఈరోజు విశిష్టమైనటువంటి ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా ఉత్తర ద్వారా దర్శన ఏర్పాట్లను చేశామని భక్తుల రద్దీ ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలిపారు

Leave A Reply

Your email address will not be published.