ప్రభుత్వ మార్గ దర్శకాలను ప్రతి ఒక్కరు పాటించాలి – ఆర్.టి.ఓ పద్మావతి
ప్రభుత్వం నిర్దేశించిన రోడ్డు సేఫ్టీ మార్గ దర్శకాలను ప్రతి ఒక్కరు పాటించాలి – ఆర్.టి.ఓ పద్మావతి
జగ్గయ్యపేట
34 వ జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలు చివరి రోజు సందర్భంగా జగ్గయ్యపేట మోటర్ వెహికల్ ఆఫీస్ వద్ద జరిగిన సమావేశంలో నందిగామ ఆర్.టి.ఓ పద్మావతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ట్రాఫిక్ రూల్స్ని ప్రతి ఒక్కరు పాటించాలని తెలియజేశారు.వాహనాలు నడిపే ముందు వాహనాలకు సంబంధిత పత్రాలు ఫోర్సులో ఉంచుకోవాలని,వాహనం నడిపే వారికి ఖచ్చితంగా లైసెన్స్ ను కలిగి ఉండాలని,ఓవర్ లోడ్ ఉండరాదని,మితిమీరిన స్పీడ్ తో డ్రైవ్ చేయరాదని,ఓవర్ స్పీడ్ గా వాహనాలను క్రాసింగ్ చేయరాదని,కారు నడిపే వారు సీటు బెల్ట్ ను పెట్టుకోవాలని, ద్విచక్ర వాహనదారుల నడిపేవారు హెల్మెంట్ ను ధరించాలి.మద్యం సేవించి వాహనాలను నడపవద్దని,సురక్షిత ప్రయాణం కోసం ప్రతి ఒక్కరు ప్రభుత్వం నిర్దేశించిన రోడ్డు భద్రతా సేఫ్టీ మార్గదర్శకాలను పాటించాలని ఆమె తెలియజేశారు.34 వ జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలు సందర్భంగా వాహనం నడిపే వారికి అవగాహన కల్పించడం జరిగిందని ఆమె తెలియజేశారు.దీనిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 2023 జనవరి 18 నుండి 24 వరకు రోడ్డు భద్రతా వారోత్సవాలలో భాగంగా యన్.టి.ఆర్ జిల్లా వ్యాప్తంగా రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా ప్రతి రోజు అవగాహన కోసం కార్యక్రమం చేయడం జరిగిందని ఆమె అన్నారు.అనంతరం తపోవన్ ప్రైవేటు పాఠశాల విద్యార్థిని చిన్నారి జాద్వికా రోడ్డు సేఫ్టీ పై ఆంగ్ల భాష లో వివరించడంతో వచ్చిన వారు ఆసక్తి గా ఆలకించారు.ఈ కార్యక్రమంలో జగ్గయ్యపేట యంవిఐ యం రవికుమార్, సీనియర్ అసిస్టెంట్ మహ్మద్ ఆలాం ,కానిస్టేబుల్ యన్ వెంకటేశ్వరావు, సిహెచ్ శరత్ చంద్ర,హోంగార్డు వై సువర్ణరావు,కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అసిస్టెంట్ హరీష్,జె.ఆర్.సి,తపోవన్ విద్యా సంస్థల తరుపున దుర్గాప్రసాద్,సరితా మరియు కేసిపి కర్మాగారం సేఫ్టీ వారు,కారు ట్రావెల్స్,ఆటో,ట్ర్యాలీ ఆటో,ద్విచక్ర వాహనాలు తదితరులు పాల్గొన్నారు.