నారా లోకేష్ పాదయాత్రకు నవతరంపార్టీ మద్దతు రావు సుబ్రహ్మణ్యం
*”నారా లోకేష్ పాదయాత్రకు నవతరంపార్టీ మద్దతు” జగన్మోహన్ రెడ్డి ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకే పాదయాత్ర..నవతరంపార్టీ జాతీయ అధ్యక్షుడు రావుసుబ్రహ్మణ్యం.*
*జగన్మోహన్ రెడ్డి ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకే నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్నారని నవతరంపార్టీ భావిస్తోంది అని నవతరంపార్టీ జాతీయ అధ్యక్షుడు రావుసుబ్రహ్మణ్యం మీడియాకు తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కావాలని ఆనాడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశారని, నేడు ప్రజా సమస్యలపై పోరాడేందుకు నారా లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర ప్రారంభించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు అని అన్నారు. పాదయాత్ర గురించి విమర్శించే అర్హత వైస్సార్ కాంగ్రెస్ పార్టీకి లేదని స్పష్టం చేశారు. లోకేష్ కుప్పం నుండి ఇచ్చాపురం వరకు చేపట్టిన పాదయాత్ర కు సంపూర్ణంగా సంఘీభావం ప్రకటించారు. ఇక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పని అయిపోయిందని వైస్సార్ కాంగ్రెస్ నేతలు పాదయాత్ర గురించి ఆందోళన చెందుతున్నారు అని అర్ధమవుతుంది అన్నారు.పవన్ కళ్యాణ్ జనసేన పార్టీతో పాటు విపక్షాల మద్దతు పాదయాత్ర కు దొరకకుండా జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది అన్నారు.తెలుగుదేశంపార్టీ కోరితే నవతరంపార్టీ నుండి పాదయాత్రలో పాల్గొని సంగీభావం తెలుపుతామని తెలిపారు.*