దాతృత్వం చాటుకున్న తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ గెల్లా సంధ్యారాణి

మెదడు వ్యాధితో బాధపడుతున్న చిన్నారి కుటుంబానికి 2 నెలల గౌరవ వేతానాన్ని అందించిన తెలుగుదేశం పార్టీ 21 వ వార్డు కౌన్సిలర్ గెల్లా సంధ్యారాణి

జగ్గయ్యపేట పట్టణంలోని విశ్వ బ్రాహ్మణ వీదికి చెందిన సుతారి అశోక్ కుమార్ పుట్టకతోనే ఒక చెయ్యి, కాలు అంగవైకల్యం తో పుట్టాడు అతనికి వివాహం అయి భార్య ఉమా మహేశ్వరి, ఇద్దరు పిల్లలను వున్నారు అశోక్ కుటుంబాన్ని పోషించుకోవడానికి వస్త్ర దుకాణంలో గుమస్తాగా ఉంటూ నెలకి 7000 రూపాయలు, బార్య వంట పని చేస్తు జీతంతో పిల్లల్ని చదివించుకుంటూ ఆర్థిక
ఇబ్బందులతో జీవితాన్ని కొనసాగిస్తున్నారు. వారి కుమారుడైన హేమంత్ కుమార్కి బ్రెయిన్ కి సంబంధించిన వ్యాధి రావడంతో చికిత్స నిమిత్తం విశాఖపట్నంలో హాస్పిటల్ లో జాయిన్ చేసారు డాక్టర్లు పరీక్షించిన అనంతరం వైద్యానికి నాలుగు లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది అన్నారు నాలుగు లక్షల రూపాయలు అంటే సాధ్యం కాని పరిస్థితి వారిది ఈ సమయంలో వారు సహాయాన్ని కోరాగా స్పందించిన జగ్గయ్యపేట పట్టణ తెలుగుదేశం పార్టీ 21వ వార్డు కౌన్సిలర్ గెల్లా సంధ్యారాణి తన కౌన్సిలర్ 2 నెలల గౌరవ వేతనాన్ని బాదిత కుటుంబ సభ్యులకు సహాయం చేస్తున్న వారి మిత్రబృందంనకు యువ నాయకులు శ్రీరాంచిన్నబాబు చేతులమీదుగా అందజేశారు

కార్యక్రమంలో గెల్లా వైకుంఠేశ్వర రావు, గుంజ ఏడుకొండలు, కేళి నాగేశ్వరరావు, కె మోహన్ రావు, ఏనుగుల వీరబాబు, పి నరేంద్ర, బండారు కిరణ్ తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.