తిరుపతి ఘాట్‌రోడ్డులో రోడ్డు ప్ర‌మాదం.

తిరుపతి ఘాట్‌రోడ్డులో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ఇద్దరు మృతి, ఒకరికి తీవ్ర గాయాలు

తిరుపతి నగరంలోని భాకరాపేట మొదటి ఘాట్ రోడ్డులో రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనాన్ని బస్సు ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. అత‌ని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్ల‌డించారు.

తిరుప‌తి మొద‌టి ఘాట్ రోడ్డు లో ప్ర‌మాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని బస్సు ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో ఇద్ద‌రు ప్రాణాలు కోల్పోగా, మ‌రొక‌రు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. అత‌ని ప‌రిస్థితి కూడా విష‌మంగా ఉంద‌ని వైద్యులు వెల్ల‌డించారు. కేసు న‌మోదుచేసుకున్న పోలీసులు విచార‌ణ జ‌రుపుతున్నారు.

ఈ రోడ్డు ప్ర‌మాదం గురించి పోలీసులు వెల్ల‌డించిన వివ‌రాలు ఇలా ఉన్నాయి.. తిరుపతి నగరంలోని భాకరాపేట మొదటి ఘాట్ రోడ్డులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనాన్ని బస్సు ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అత‌ని ప‌రిస్థితి సైతం విష‌మంగా ఉంద‌నీ, ప్రాణాలు నిలుపుకోవ‌డానికి పోరాడుతున్నాడ‌ని వైద్యులు తెలిపారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రమాదాన్ని ప్రత్యక్షంగా చూసిన స్థానికులు తెలిపారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను వెలికితీశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.