*కుప్పంలో చంద్రబాబు సభ జరిగితే విజయవాడలో 30 యాక్ట్ అమలు చేస్తారా?జీవో నంబర్ 1 రద్దు చేయాల్సిందే!..పౌరహక్కుల సంఘం సమావేశంలో నవతరంపార్టీ జాతీయ అధ్యక్షుడు రావుసుబ్రహ్మణ్యం.
కుప్పంలో చంద్రబాబు సభ జరిగితే విజయవాడలో, శ్రీకాకుళంలో 30 యాక్ట్ అమలు చేస్తారా?అని నవతరంపార్టీ జాతీయ అధ్యక్షుడు రావుసుబ్రహ్మణ్యం ప్రశ్నించారు.విజయవాడలో బాలోత్సవ్ భవన్ లో ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం ఆధ్వర్యంలో 08.01.2023 ఆదివారం ఉదయం11 గంటల సమయంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో రావుసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ అసలు మనకు స్వాతంత్ర్యం వచ్చిందా అని సందేహం కలుగుతోంది అన్నారు.ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెచ్చిన జీవో నంబర్1 చెల్లని జీవో అన్నారు. జగన్మోహన్ రెడ్డి మాత్రమే మానవతావాది కాదని,మేమందరం కూడా మానవతా వాదులమే అన్నారు. కందుకూరు, గుంటూరు ఘటనల్లో చనిపోయిన వారిపై అన్నీ రాజకీయ పార్టీలకు సానుభూతి ఉందన్నారు.30 యాక్ట్ ఎక్కడైతే ఆందోళనలు, ధర్నాలు జరుపుతున్నారో అక్కడ అమలు చేయాలని,అలా కాకుండా రాష్ట్రం మొత్తం ఎలా అమలు చేస్తారో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం సమాధానం చెప్పాలి అన్నారు. రాష్ట్రంలో జీవో నంబర్ వన్ రద్దుకు సంఘటితంగా పోరాడాలని పిలుపునిచ్చారు.సమావేశానికి సుంకర రాజేంద్రప్రసాద్ అధ్యక్షుడిగా వ్యవహరించారు.ముప్పాళ్ల సుబ్బారావు, పొత్తూరి సురేష్ కుమార్ మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, మాజీ పార్లమెంటు సభ్యులు కొనకళ్ల నారాయణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు,నవతరంపార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు వి సాయి,పోతుల బాలకోటయ్య, చెవుల కృష్ణఆంజనేయులు పలు పార్టీలు, సంఘాలు నేతలు పాల్గొన్నారు.*