ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి.ఇప్పటి నుంచే ఎన్నికల ఫీవర్ కనిపిస్తోంది. రాష్ట్రంలో ఉన్న వివిధ పార్టీల మధ్య మాటల యుద్ధం పీక్కు చేరింది.
కీలక నేతలంతా జనం బాట పట్టి తమ అదృష్టాన్ని వరించే పనిలో ఉన్నారు. ఇదే సమయంలో జంప్ జిలానీలు ప్రత్యేక చర్చగా మారుతున్నారు. వచ్చే నెల నుంచి అన్ని పార్టీల్లో భారీగా వలసలు ఉంటాయనే ప్రచారం ఉంది. ఇలాంటి సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఊహించని షాక్ తగిలింది. పార్టీకి చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్ BRS పార్టీ లో చేరుతున్నట్టు టాక్.
ప్రస్తుతం జనసేన పార్టీలో కాపు సామాజివర్గానికి చెందిన ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర రావు కీలకంగా ఉన్నారు. కానీ ఆయన పార్టీని వీడనున్నట్లు సమాచారం. హైదరాబాదులో రేపు ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీ తీర్ధాన్ని పుచ్చుకుంటారని తెలుస్తోంది. ఆ వెంటనే ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్ పేరును కేసీఆర్ ప్రకటిస్తారని తెలుస్తోంది.
రేపు ఉదయం గుంటూరు అరండల్ పేట నుండి భారీ ఎత్తున ర్యాలీతో హైదరాబాదు వెళ్ళనున్నారు. ఇప్పటికే తన సన్నిహితులతో తాను జనసేన పార్టీ వీడనున్నట్లు చంద్రశేఖర్ సంకేతాలను ఇచ్చారని తెలుస్తోంది రెండో తేదీన తనకు అందుబాటులో ఉండాలని వారిని కోరారని టాక్. జనసేనలో తోట చంద్రశేఖర్ ప్రస్తుతం పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యుడుగా కొనసాగుతున్నారు. తోట చంద్రశేఖర రావు బీ ఆర్ ఎస్ పార్టీలో చేరికతో ఆంధ్రప్రదేశ్ లో మరి కొంతమంది అధికారులు ఆయనతోపాటు వచ్చే ఎన్నికల్లో బీ ఆర్ ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నట్లుగా విశ్వసనీయ సమాచారం