ఇంకా పెరగనున్న వాహానాల ధరలు

ముంబై, ఫిబ్రవరి 17: దేశంలో కరోనా కారణంగా రెండేళ్లుగా వాహనాలకు పెద్దగా డిమాండ్ లేదు. కానీ వాహనాల ధరలు పెరగుదల వెనుక ఉన్న కారణమేమిటి అనేది అసలు ప్రశ్న. దీనికి సమాధానం ఏమిటంచే ముడి పదార్థాల ధరల పెరుగుదల. వాహనాలు, స్కూటీలు తయారీలో ఎక్కువగా లోహాల వినియోగిస్తుంటారు. గత రెండేళ్లుగా లోహాల ధరలు భారీగా పెరిగాయి. స్టీల్ ధరలు 50 శాతానికి పైగా పెరగగా.. రాగి 77 శాతానికి పైగా పెరిగింది. ఇదే సమయంలో అల్యూమినియం, నికెల్ ధరలు దాదాపు రెండింతలు పెరిగాయి. లోహాలను కేవలం వాహనాల తయారీకి మాత్రమే ఉపయోగించరు. గృహోపకరణాలైన రిఫ్రిజరేటర్, వాషింగ్ మెషిన్, ఏసీల తయారీలో కూడా వినియోగిస్తారు. ఈ ఉత్పత్తులను తయారు చేసే కంపెనీలు సైతం ముడి పదార్థాల ధరలు పెరగుదల ఒత్తిడితో.. ఇప్పటికే ధరల పెంపును ప్రకటించాయి. అంటే వేసవిలో వీటి కొనుగోలు మరింత ఖరీదు కానుంది.టీవీలు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్‌ల తయారీలో కూడా లోహాలను ఉపయోగిస్తారు.

ఇదే సమయంలో.. మొబైల్స్, ల్యాప్‌టాప్‌ల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. ఇదొక్కటే కాదు.. ఉక్కు, రాగి, అల్యూమినియం వంటి లోహాలను ఇళ్లు, దుకాణాలు, భవనాలు, ఇతర మౌలిక సదుపాయాల నిర్మాణాల్లో కూడా ఉపయోగిస్తారు. అంటే.. పెరిగిన లోహాల ధరలు నిర్మాణ వ్యయాన్ని కూడా పెంచనున్నాయి. ఈ ధరల పెరుగుదల వినియోగదాల జోబులకు చిల్లు పెట్టనున్నాయి. లోహాల ధరల పెరుగుదలకు కరోనా కూడా ఒక కారణంగా చెప్పుకోవాలి. గతంలో ప్రపంచవ్యాప్తంగా లాక్‌డౌన్ కారణంగా లోహాల సరఫరాపై ప్రభావం చూపింది. ఇప్పుడు వ్యాపారాలు పునః ప్రారంభం కావటంతో ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పుంజుకుంటోంది. లోహాల దిగుమతులపై ఆధారపడ్డ భారత్ లాంటి దేశానికి ఈ సమస్య మరింత తీవ్రమైందని చెప్పుకోవాలి. ఉక్కు తప్ప.. చాలా లోహాల దిగుమతి చేసుకుంటున్నాం.

ఈ క్రమంలో.. ప్రపంచ స్థాయిలో ధరలు పెరిగితే ఆ ప్రభావం భారత్ పై ఉంటుంది.ఇప్పుడు మరో ప్రశ్న ఏంటంటే.. ఇది ఎంత కాలం మనల్ని ఎంతకాలం వెంటాడుతుందన్నదే. దానికి సమాధానం ధరల పెరుగుదల. నిపుణుల అభిప్రాయం ప్రకారం సరఫరా కొరతే దీనికి మూల కారణం.. కొరత తీరే వరకు సమస్య కొనసాగుతుందని అంటున్నారు. జూన్ తర్వాత సరఫరా పరిస్థితులు సాధారణ స్థితికి వస్తాయని, ఆ తర్వాతే ధరలు తగ్గుతాయని కేడియా అడ్వైజరీ డైరెక్టర్ అజయ్ కేడియా అభిప్రాయపడ్డారు. ఏప్రిల్ వరకు ధరలు తగ్గే అవకాశం లేదని ఐఐఎఫ్ఎల్ వైస్ ప్రెసిడెంట్ అనూజ్ గుప్తా కూడా వెల్లడించారు. ఏప్రిల్ తర్వాత, సరఫరాలో మెరుగుదల ఏర్పడే అవకాశం ఉందని.. అది ధరలను తగ్గించడంలో సహాయపడుతుందని తెలుస్తోంది. దీని వల్ల మనకు తెలుస్తున్న విషయం ఏమిటంటే అధిక మెటల్ ధరల సమస్య మిమ్మల్ని చాలా కాలం ఇబ్బంది పెట్టవచ్చు.

Leave A Reply

Your email address will not be published.