డిజిటల్ డ్రైవింగ్ లైసెన్స్.. ఇలా డౌన్ లోడ్ చేసుకోవచ్చు..!

డ్రైవింగ్ లైసెన్స్ డిజిటల్ కాపీ ఫోన్లో పెట్టుకోవడం సురక్షితం. పైగా సౌకర్యం కూడా. అయితే ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ ను ఫొటో తీసి ఫోన్లో పెట్టుకోవచ్చుగా? అంటే అలా కూడా చేసుకోవచ్చు. కాకపోతే అది ఫొటో కాపీ మాత్రమే. అదే డిజిటల్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే అసలైన కాపీ అవుతుంది. ఫిజికల్ డ్రైవింగ్ లైసెన్స్ మాదిరే ఈ-డ్రైవింగ్ లైసెన్స్ కూడా చెల్లుబాటు అవుతుంది. ఆన్ లైన్ లో డిజిటల్ లైనెన్స్ ను పరివాహన్ సేవా వెబ్ సైట్ లేదా డిజీలాకర్ వెబ్ సైట్ లేదా డిజీలాకర్ మొబైల్ యాప్ ను ఉపయోగించుకుని డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

ముందుగా ‘పరివాహన్ సేవా’ (https://parivahan.gov.in/) వెబ్ పేజీకి వెళ్లాలి. ఆన్ లైన్ సర్వీసెస్ సెక్షన్ లో ‘డ్రైవర్స్ లైసెన్స్ రిలైటెడ్ సర్వీసెస్’ ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. రాష్టాన్ని ఎంపిక చేసుకోవాలి. డ్రైవింగ్ లైనెస్స్ సెక్షన్ లో ‘ప్రింట్ డ్రైవింగ్ లైసెన్స్’ను ఎంపిక చేసుకోవాలి. దరఖాస్తును పూర్తి చేయాలి. దీన్ని ప్రింట్ తీసుకోవడం లేదంటే పీడీఎఫ్ డాక్యు మెంట్ రూపంలో సేవ్ చేసుకోవచ్చు.

డీజీలాకర్ పోర్టల్ పై (https://digilocker.gov.in/) లాగిన్ అవ్వాలి. ‘సెర్చ్ డాక్యుమెంట్స్’ను క్లిక్ చేయాలి. పేజీ పై భాగంలో ఎడమ చేతివైపు ఇది ఉంటుంది. డ్రైవింగ్ లైసెన్స్ ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. ‘మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ అండ్ హైవేస్’ పై ట్యాప్ చేయాలి. అక్కడ డ్రైవింగ్ లైసెన్స్ నంబర్ నమోదు చేసి.. ‘గెట్ ద డాక్యుమెంట్’ పై క్లిక్ చేయాలి. డ్రైవర్స్ లైసెన్స్ డౌన్ లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ అండ్ హైవేస్ పై ట్యాప్ చేయాలి.

ఇక ఫోన్లో డిజీలాకర్ యాప్ ను తెరవాలి. ‘డాక్యుమెంట్స్ యూ మైట్ నీడ్’ సెక్షన్ పై క్లిక్ చేయాలి. అక్కడ ‘డ్రైవింగ్ లైసెన్స్’ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. అక్కడ డ్రైవింగ్ లైసెన్స్ నంబర్ నమోదు చేసి.. గెట్ ద డాక్యుమెంట్ పై క్లిక్ చేయాలి. డ్రైవర్స్ లైసెన్స్ డౌన్ లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది.

Leave A Reply

Your email address will not be published.