కొత్త ఐడియా తో రైల్వేకు కాసుల వర్షం
న్యూఢిల్లీ: రైల్వేశాఖ సరికొత్త ఐడియా ఆ శాఖకు కాసుల వర్షం కురిపిస్తున్నది. 150 సంత్సరాలుగా దేశంలో రైళ్లు సేవలు అందిస్తున్నాయి. నిరంతరం వేల కిలోమీటర్ల మేర రైళ్లు పరుగులు తీస్తున్నాయి. దేశంలో 50 సంత్సరాల నుంచి సేవలు అందిస్తున్న రైల్వే పెట్టెలు అనేకం ఉన్నాయి. అవి ప్రస్తుతం ఫిట్‌నెస్ సమస్యలు ఎదుర్కొంటున్నాయి. కొన్నింటిని మ్యానేజ్ చేసి ఏదోలా నడిపిస్తున్నారు. ఫిట్‌నెస్ సమస్యలను ఎదుర్కొంటున్న రైల్వే కోచ్‌లు అనేకం ఉన్నాయి. వీటిని అలాగే వదిలేస్తే తుప్పుపట్టిపోతాయి. వీటిని ఎలాగైనా వినియోగించుకోవాలని చూసిన రైల్వేశాఖ కొత్తగా ఆలోచించింది.బిజీగా ఉన్న రైల్వేస్టేషన్లు, రైల్వే ఖాళీ స్థలాల్లో రైల్వే కోచ్‌లతో హోటల్స్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది.
మొదట మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో కోచ్‌లతో హోటల్ ను ఏర్పాటు చేశారు. రైల్వే వర్క్‌షాప్‌లో హోటల్‌కు అనుగుణంగా మార్పులు చేసి హోటల్‌ను ఏర్పాటు చేశారు. భోపాల్‌లో ఏర్పాటు చేసిన హోటల్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో జబల్‌పూర్ స్టేషన్ వద్ద మరో హోటల్‌ను ఏర్పాటు చేశారు. అక్కడ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో దేశంలోని అనేక స్టేషన్ల వద్ద రైల్వే కోచ్‌లతో హోటల్స్‌ను ఏర్పాటు చేసేందుకు రైల్వేశాఖ సిద్దమయింది.