కాచారం గ్రామంలో మహాత్మా గాంధీ విగ్రహ ఏర్పాటుకు ఆర్థిక సహకారం అందిస్తా : వంగపల్లి అంజయ్య స్వామి

యాదాద్రి భువనగిరి జిల్లా కాచారం లో ఆదివారం మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా గ్రామ పంచాయితీ కార్యాలయం వద్ద గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ చిత్ర పటానికి పూలమాలలు వేసి మహాత్మా గాంధీని స్మరించుకుని ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న రేణుకా ఎల్లమ్మ దేవాలయం వ్యవస్థాపక అధ్యక్షుడు వంగపల్లి అంజయ్య స్వామి మాట్లాడుతూ మహాత్మా గాంధీ చిరస్మరణీయులు అని అఖండ భారతావని విదేశీ కబంధ హస్తాల నుండి శాంతి యుత మార్గంలో భారత దేశానికి స్వాతంత్రం సిద్ధించడానికి చేసిన కృషి మరువలేనిది అని వారి అడుగుజాడల్లో నడుస్తూ వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు, గ్రామంలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలని అందుకు మహాత్మా గాంధీ విగ్రహాన్ని స్వంత ఖర్చులతో అందజేస్తా అని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా గ్రామస్థులు జయ స్వామి అభినందించారు కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అరుణ అశోక్ రెడ్డి,ఉప సర్పంచ్,వార్డ్ మెంబర్లు,ఎంపీటీసీ,సుగుణ,పుట్ట శ్రీనివాస్,సుగుణ, బాల రెడ్డి,మల్లయ్య,సిద్ధులు,మల్లారెడ్డి, కృష్ణ రెడ్డి,సుభాష్ తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.