అధునాతనం….ఆకర్షణీయం..

శనివారం యాదాద్రిలో విల్లాలు, ప్రెసిడెన్షియల్ సూట్ల ప్రారంభం?
యాదాద్రి: ప్రముఖ పుణ్యక్షేత్రంగా రూపొందుతున్న యాదాద్రి లో దేశ, విదేశీ నేతల విడిది కోసం అధునాతనంగా, సంప్రదాయ రీతిలో నిర్మించిన ప్రెసిడెన్షియల్ సూట్, విల్లాలు ప్రారంభానికి సిద్ధమయ్యాయి.. యాదాద్రీశుడు కొలువైన కొండ కింద ఉత్తర దిశలోని చిన్నకొండపై ఈ 14 విల్లాలు,ఒక ప్రధాన (ప్రెసిడెన్షియల్) సూట్ నిర్మించారు. వీటి ప్రాంగణం చుట్టూ ప్రహరీతో పాటు పచ్చదనం ఏర్పాటు చేశారు. 13.20 ఎకరాల విస్తీర్ణంలోఈ గృహాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.1,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రత్యేక సదుపాయాలతో ప్రెసిడె న్షియల్ సూట్ కట్టారు.తూర్పు దిశలో తొమ్మిది విల్లాలు, ఉత్తర దిశలో ఐదు విల్లాలు నిర్మితమ య్యాయి.

ప్రెసిడెన్షియల్ సూటుకు వెళ్లే మార్గాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఆలయాన్ని తిలకించేందుకు వ్యూ పాయింట్, డైనింగ్ హాల్, అధునాతనంగా ఎనోక్లోజర్ అద్దాలు, డిజిటలైజ్ రెయిన్ షవర్, సెంట్రల్ ఏసీ వనరులను కల్పించారు. అధునాతనంగా నిర్మితమైన ప్రెసిడెన్షియల్ సూట్, విల్లాలు ఈ నెల 12న(శనివారం) ప్రారంభం కానున్నాయని తెలిసింది. ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చే అవకాశాలున్నాయి. ఆ గృహాల నిర్మాణంతోపాటు ఇతర సదుపాయాల కల్పనకు సుమారు రూ.120 కోట్ల ఖర్చు చేసినట్లు అధికారులు చెబుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.